విజయవాడ టిడిపి లో కుమ్ములాట జోరు……

 విజయవాడ తుర్పూ ఎమ్మేల్యే గద్దే రామ్మెహన్ ,మేయర్ కోనేరు శ్రీధర్ ల మధ్య వివాదం తారా స్ధాయి కి చేరింది.ఈ వివాదానికి కారణం తుర్పూ ఎమ్యేల్యే టికెట్టును 2019 ఎన్నికల్లో తన కే ఇవ్వాలని మేయర్ కోనేరు పావులు కదుపుతున్నాడు.ఈ కోరికే వివాదానికి ప్రధాన కారణం అయింది.ఎలాగైనా ఆ టికెట్ దక్కాలంటే గద్దే రామ్మోహన్ ను ఇరకాటంలో పెట్టేందుకు సిద్దమయ్యాడు మేయర్.
ఏకంగా పార్టీ పెద్దలతో పావులు కదుపుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే కు మరింత అసంతృప్తి తెప్పించింది. ఈ వ్యవహారం తో కార్పోరేటర్లు కూడా మేయర్ తో సన్నిహితంగా ఉండటం లేదు.ఈ పరిస్థితులను చూస్తుంటే ఒంటరి అయ్యాడు మేయర్.చివరకు తమ పాలన నాలుగేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరిపుకోలెని దుస్థితి ఏర్పడింది.
మేయర్ తుర్పూ నియోజకవర్గంలో కార్పొరేషన్ నిధులు మంజూరు తమకు అనుకూలంగా వారి ప్రాంతంలో చేస్తున్నారు.అదే విధంగా నూతన పనుల ప్రారంభ సమయంలో ప్రోటోకాల్ పాటించడం లేదు అని అధికారుల పై ఒత్తిడి పెంచారు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్. చివరికి ఈ కుమ్ములాట విషయం సిఎం చంద్రబాబు దృష్టికి వేళ్ళింది.ఎమ్మెల్యే చేప్పిన పనులు కాకుండా ,తమ అనుచరుల బిల్డింగ్స్ కూల్చివేయాలని మేయర్ శ్రీధర్ అధికారులకు ఇస్తున్నారు అని టీడీపీ బాస్ చంద్రబాబు కు ఫిర్యాదు చేశాడు ఎమ్మెల్యే గద్దే. ఈ వ్యవహారం పై చంద్రబాబు మేయర్ కు అక్షింతలు వేసారు.స్వచ్చ సర్వేక్షణ్ అవార్డు సాధించాం అని తమ పనితనాన్ని వివరించడానికి మేయర్, సిఎం వద్దకు వెళ్ళినప్పుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పద్దతి, పార్టీ పని తీరులో మార్చుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని సిఎం, మేయర్ శ్రీధర్ కు సిరియస్ గానే క్లాస్ ఇచ్చారు.
అయితే విజయవాడ లో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ , మేయర్ కొనేరు శ్రీధర్ మద్య అంతర్యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విజయవాడ టీడీపీ నాయకుల మధ్య టీకెట్టు యుద్ధం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.