రాజధానిపై  కీలక నిర్ణయం తీసుకున్నారా

రాజధాని అమరావతి తరలింపుపై జగన్మోహన్ రెడ్డిపై కీలక నిర్ణయం తీసుకున్నారా ? అంటే అవుననే అంటున్నాయి అధికారవర్గాలు. సిఆర్టీఏపై జగన్ అధ్యక్షతన సమీక్ష జరిగింది. తర్వాత మంత్రి బొత్సా సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాజధాని తరలింపుపై తాను ఎక్కడా మాట్లాడలేదన్న విషయాన్ని గుర్తుచేశారు.

అంటే గడచిన పది రోజులుగా రాజధాని అమరావతి తరలిపోతుందని పచ్చ బ్యాచ్ తో పాటు ఎల్లోమీడియా కూడా ఒకటే గగ్గోలు పెట్టేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి అయ్యే వ్యయం, కష్టనష్టాలను బొత్స చెప్పగానే ఊహాగానాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. జగన్ పై నిర్దిష్ట ఆరోపణలు, విమర్శలకు అవస్తలు పడుతున్న చంద్రబాబు అండ్ కో కు ఎల్లోమీడియాకు బొత్సా మాటలు అందివచ్చాయి.

సరే ఆ సమయంలో జగన్ అమెరికా టూర్ లో ఉన్నారు. తర్వాత తిరిగి వచ్చిన తర్వాత కూడా ఈ విషయమై జగన్ ఏమీ మాట్లాడలేదు. అయితే తాజాగా జరిగిన సమీక్షలో జగన్ అన్నీ విషయాలను పరిశీలించినట్లు సమాచారం. కాస్త అటు ఇటు అయినా రాజధాని మాత్రం ఇక్కడే ఉంటుందని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఇదే విషయాన్ని బొత్స ప్రత్యేకంగా చెప్పకపోయినా రాజధాని మారుతుందని తాను చెప్పలేదని స్పష్టం చేయటంతోనే రాజధాని మారదు అనే యాంగిల్ బయటకు వచ్చింది. నిజానికి రాజధానిపై ఇంత రచ్చ జరగటానికి టిడిపి+ఎల్లోమీడియానే ప్రధాన కారణమని అర్ధమైపోతోంది.