మోదీని ఫాలో అవుతున్న ప‌వ‌న్‌!

దేశంలో రోజు రోజుకి క‌రోనా వైర‌స్ సోకిన కేసులు ఎక్కువ‌వుతున్నాయి. దీన్ని క‌ట్ట‌డి చేయాలంటే సోష‌ల్ డిస్టెన్సీ త‌ప్ప‌నిస‌రి. అయితే దేశంలో దీన్ని ఎవ‌రూ పాటించ‌డం లేదు. దీంతో ఇండియా మ‌రో ఇట‌లీగా మారే ప్ర‌మాదం అంచుకు చేరుకునే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. దీంతో అత్య‌వ‌స‌రంగా మీడియా ముందుకొచ్చిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ని ప్రక‌టించారు. ఇది జ‌న‌తా క‌ర్ఫ్యూకి మించి వుంటుంద‌ని, దీన్ని ఎవ‌రూ అతిక్ర‌మించ‌వ‌ద్ద‌ని, ఇదొక ల‌క్ష్మ‌ణ రేఖ లాంటిద‌ని దాదాపు హెచ్చ‌రించే ప్ర‌య‌త్నం చేశారు.

ఇది 21 డేస్ అంటే మంగ‌ళ వారం అర్థ‌రాత్రి నుంచి ఇది అమ‌ల‌వుతుంద‌ని దీన్ని అతిక్ర‌మించి ఎవ‌రూ ఇళ్లల్లోంచి బ‌య‌టికి రావ‌ద్ద‌ని సూచించారు. ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 15 వ‌ర‌కు కొన‌సాగ‌బోతోంది. దీనిపై ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్పందించారు. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీగారు చెప్పినట్లు ఈ రోజు అర్థ‌రాత్రి నుంచి 21 రోజుల పాటు లాక్ డౌన్‌ను అంద‌రూ విధిగా పాటించాల‌ని మ‌న‌స్పూర్తిగా అభ్య‌ర్థిస్తున్నాను అన్నారు. క‌రోనా మ‌హ‌మ్మారిని ఎదుర్కోనేందుకు వేరే దారి లేదు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన సూచ‌న‌లను అనుస‌రించండ‌ని, ద‌య‌చేసి అంద‌రూ ఇంటికే ప‌రిమితం కావాల‌ని కోరుతున్నాను. బ‌య‌టికి ఎవ‌రు రావ‌ద్దు. ఎవ‌రికైనా ఆరోడ్య స‌మ‌స్య‌లు వ‌చ్చినా ప్రాణాపాయ ప‌రిస్థితులు ఎదురైనా ఎమ‌ర్జెన్సీ నంబ‌ర్ల‌కు ఫోన్ చేసి సేవ‌లు, సూచ‌న‌లు పొందండి. ఈ విప‌త్క‌ర ప‌రిస్థితుల నుంచి బ‌య‌ట ప‌డ‌టానికి అంద‌రూ స‌హ‌క‌రించాలి` అని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ విజ్ఞ‌ప్తి చేశారు. ఎప్పుడు ప్ర‌ధాని మోదీ స్పందించినా ప‌వ‌న్ వెంట‌నే దాన్ని ఫాలో అవుతూ వీడియో సందేశాన్ని రిలీజ్ చేయ‌డంతో అంతా అవాక్క‌వుతున్నారు. ఎంత‌లో ఎంత మార్పు అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు.