విశాఖపట్నం అంటేనే అందమైన ప్రదేశాలకు, ప్రశాంతమైన వాతావరణానికి సింబాలిజమ్ లా వెలిగిపోతుంది. పైగా అది ఇప్పుడు మన నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని కూడా. అయితే విశాఖను వరుస ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఎల్జీ పాలిమర్స్, సాయినార్ కెమికల్స్ నుంచి గ్యాస్ లీకేజ్‌లు సృష్టించిన తీవ్రత నుంచి కోలుకోకముందే మరో పారిశ్రామిక ప్రమాదం జరిగింది. విశాఖ పరవాడలోని రాంకీ సీఈటీపీ సాల్వెంట్స్‌లో భారీ పేలుడు సంభవించింది.
దీంతో ఆ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడుతుండగా స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అగ్నిమాపక శకటాలు కూడా సమీపంగా వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా వరుస ఘటనలు జరుగుతుండడం విశాఖ వాసులను తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది.
శానిటైజర్లు తయ్యారు చేసే ఈ కంపెనీలో ఎగిసిపడుతున్న మంటలు చుట్టు పక్కల ఫ్యాక్టరీలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది. అయితే 17సార్లు పేలుడు శబ్దాలు వినిపించినట్లు స్థానికులు చెబుతుండగా స్టోరేజ్ చేసిన కెమికల్ డ్రమ్ములు పేలుతున్నాయా, లేక బాయిలర్ పేలిందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఏదేమైనా వరుస ఘటనలు జరుగుతుండడం విశాఖ వాసులను తీవ్ర విస్మయానికి గురి చేస్తుంది.
అసలు ఎందుకు ఈ మధ్య విశాఖలోనే వరుసగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ? దీని వెనుక ఎవరైనా ఉన్నారా ? లేకపోతే గత పదేళ్లల్లో ఎప్పుడూ లేని ప్రమాదాల కొనసాగింపు ఇప్పుడే ఎందుకు ? సాగర తీర నగరంలో ఇలా వరుసగా జరుగుతూ పోతే… రాజధాని అనే బ్రాండ్ కి పెద్ద బ్యాడ్ నేమ్ అయిపోతుంది. మరి జగన్ ప్రభుత్వం ఈ ప్రమాదాలు జరగకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వానికి ఉంది.
#Breaking Fire accident at an industrial unit in Paravada Pharma City in #Vizag dist. No casualties reported @ysjagan#Visakhapatnam @telugurajyam pic.twitter.com/e8l8mWifyc
— telugurajyam.com (@telugurajyam) July 13, 2020