జగన్ రాజకీయం పై ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా.. జగన్ ది కచ్చితంగా ప్రత్యేక శైలినే. ఒకవిధంగా ఈ తరం రాజకీయాల్లో స్పీడ్ గా సంచలనాత్మక నిర్ణయాలను తీసుకుంటూ… విమర్శలు ఎన్ని వస్తోన్నా, తీసుకున్న నిర్ణయాలను అవలీలగా ప్రకటించేయడం..వాటిని అమలు పరచడం ఒక్క జగన్ కే చెల్లిందనేది ప్రత్యర్థుల మనోగతం కూడా. పైగా ఇచ్చిన హామీల అమలు కోసం పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్లడంలోనూ జగన్ ఎవ్వరికీ అందడం లేదు అనేది నిజం. ఆ మాటకొస్తే గత సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని అధికారాన్ని దక్కించుకున్నప్పటి నుండీ.. జగన్ తన నిర్ణయాలతో ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉన్నారు.
నిజానికి ఇచ్చిన హామీల పై విమర్శలు వచ్చినా.. జగన్ మాత్రం అసలు వెనక్కి తగ్గడం లేదంటే జగన్ ధైర్యానికి అది నిదర్శనం. అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కూడా వెనుకాడని తెగింపు జగన్ ది. ముఖ్యంగా పోలవరం, రాజధాని వంటి వాటిలో వైసీపీ ప్రభుత్వం ఆచీతూచి అడుగులు వేస్తూ టీడీపీ అవినీతిని భయటపెట్టే పనిలో ఉంది. ఇప్పటికే గతంలో టీడీపీ హయాంలో జరిగిన భూముల వేలం పై విజిలెన్స్ విచారణ జరిపించిన జగన్.. బాబు గుట్టు పై ఓ అవగాహనకు వచినట్టు తెలుస్తోంది. చేసిన అవినీతిని మాయం చేయండంలో బాబుకు నలభై ఏళ్ళ అనుభవం. అందుకే అవినీతి జరిగినా ఎక్కడ జరిగిందో ఆధారాలు దొరకని పరిస్థితి ఉందట.
అయినా చంద్రబాబు ప్రభుత్వం అనేక రకాలుగా అవినీతికి పాల్పడిందని నిరూపించే దాకా జగన్ వదిలేలా లేడు. బాబు అవినీతి పై ఇప్పటికే సమీక్ష కూడా జరిపించి, బాబు సన్నిహితులను జగన్ టార్గెట్ చేశాడట. వారి ద్వారా బాబు బినామీ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నారట. ఈ పరిణామాల పై బాబు షాక్ అవుతున్నాడట. ఏది ఏమైనా జగన్ బాబుగోరికి నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు. ఒకపక్క ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలతో అవినీతిరహిత పాలనను అందించే దిశగా అడుగులు వేస్తూనే.. మరోపక్క బాబును వ్యూహాత్మకంగా దెబ్బ కొట్టే పక్రియను శరవేగంగా ముందుకు నడుపుతున్నాడు జగన్.