ప్చ్..  లోకేష్ కు జైలు తప్పేలా లేదు ! 

 
ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారిని   మొత్తానికి జగన్ వేటాడేస్తున్నట్లు కనిపిస్తోంది ప్రస్తుత పరిస్థితి. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి లాంటి టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజే అరెస్ట్ చేయడంతో  టీడీపీ నేతలు, శ్రేణుల్లో  కలకలం రేగిన మాట వాస్తవం. ఎప్పుడు ఏమవుతుందో అని ఇప్పటికి టీడీపీ నేతలు ఇంకా ఆందోళనలో ఉన్నారట.  అచ్చెన్నాయుడుని పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లగా ఆయనకు అనుమతి నిరాకరించారంటే  జగన్ పంతం ఏమిటో అర్ధమవుతుంది. ఇక జేసీ ఫ్యామిలీని ఓదార్చడానికి నారా లోకేష్  అనంతపురం వెళ్లి  జేసీ అరెస్ట్ కు నిరసనగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని చూసిన చివరికీ అది కామెడీగా ముగిసింది. 


అయితే ఈఎస్ఐ స్కాంతో పాటు ఫైబర్ గ్రిడ్, సహా చంద్రబాబు పాలనలో నారా లోకేషే  కీలకంగా వ్యవహరించిన మాట వాస్తవం. అందుకే  అచ్చెన్నను నారా లోకేష్ కలవటానికి  కూడా వెళ్ళలేదు.  కలిస్తే పాత అవినీతి విషయాలు తవ్వుకున్నట్టు ఉంటుందని అచ్చెన్న ముఖం చూడడానికి కూడా చిన్న బాబు భయపడినట్లు ఉన్నాడని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.  వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల టీడీపీ సీనియర్లు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప  పై కేసులు బుక్ కావడంతో వారేనని  క్లారిటీ వచ్చేసింది.   

 
అలాగే  లోకేష్ బాబుకు సంబంధించిన అవినీతి పురాణం కూడా జగన్ దగ్గర ఉందని, కచ్చితంగా జగన్ హిట్ లిస్ట్ నుండి  చిన్న బాబు తప్పించుకునే వీలు లేకుండా  న్యాయపరమైన లొసుగులను పరిశీలించి  ఎట్టిపరిస్థితుల్లో లోకేష్ బాబును జైలుకు పంపాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి లోకేష్ కు జైలు తప్పేలా లేదు.