పాపం బాబుగోరు.. తమ్ముళ్లకు కన్నీళ్లే ! 

టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చుకునేందుకు ఎల్లో మీడియా సర్వ శక్తులు ఒడ్డుతున్నా… టీడీపీకి ఊపు రావడం లేదు.  బాబును చూస్తే  గిట్టనివారికి కూడా జాలి కలుగుతుందని వైసీపీ వాళ్ళు నవ్వుకుంటున్నారు.  మొత్తానికి బాబు నాలుగు దశాబ్దాల రాజకీయాల్లో ఇలాంటి అవమానాలు ఎప్పుడు పడలేదు.   తెలుగుదేశం ఓటమి.. బాబు రాజకీయ జీవిత పతనానికి పునాదిలా మారిందా…?  పైగా గెలిచిన 23లో  చివరికి 21 స్థానాలకు మాత్రమే పరిమితం అయ్యాక  ఇక తెలుగుదేశం పార్టీ పనయ్యిపోయిందనే భావన కూడా  టీడీపీ నాయకుల్లో బలంగా నాటుకుపోయిందేమో అనిపిస్తోంది. 
 
అందుకేనేమో  బాబుకు సరిగ్గా సపోర్ట్  చేయలేకపోతున్నారు. ఒకపక్క బాబును రోజు వైసీపీ నాయకులు హేళన చేస్తుంటే..  టీడీపీ నాయకులూ స్పందించాల్సిన స్థాయిలో స్పందించకుండా సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు.  ఈ పరిణామాల అన్నిటినీ గమనిస్తే.. టీడీపీ పార్టీ బలం రోజురోజుకు మరింత దిగజారిపోతోందని అనిపిస్తోంది. బహుశా బాబుకి కూడా ఇలాగే అనిపిస్తోందేమో. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో   చంద్రబాబును గమనించినట్లతే బాబు మొహంలో బెఱుకు సుస్పష్టంగా కనిపిస్తుంది. అలాగే బాబు మాటల్లోని తడబాటు, ఆవేదన బాగానే ఎలివేట్ అవుతుంది. అన్నిటికి మించి వైసీపీ  నాయకుల మాటల దాడికి  నిజంగా తెలుగు తమ్ముళ్లకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పాపం బాబుగోరు.. చివరికీ ఇలా అయిపోయారేంటి..!