గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ప్రజా తీర్పుతో బాబుగోరు మరియు లోకేశంతో పాటు పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర నిరుత్సాహానికి గురైన మాట వాస్తవం. ఇప్పుడున్న పరిస్ధితుల్లో తెదేపా మళ్లీ అధికారంలోకి వస్తోందనే ఆశ టీడీపీ నాయకుల్లో కూడా పూర్తిగా పోయింది. ఒకపక్క బాబుగోరు రాబోయే రోజుల్లో మళ్లీ మనమే గెలుస్తున్నాం అని ఎంత మొత్తుకున్నా.. టీడీపీ క్యాడర్ లో కనీస స్పందన కూడా రాని పరిస్థితి. పైగా పార్టీని నమ్ముకుని ఏళ్ల తరబడి అలుపెరుగని సేవలు చేసిన కార్యకర్తలు సైతం.. పార్టీకి వదిలేస్తున్నారు. ఇన్నేళ్లు కష్టానికి దక్కని ఫలితం ఏమిటి అని ఇతర పార్టీ కిందస్థాయి నాయకులూ వాళ్ళను తమ పార్టీలో కలిపేసుకుంటున్నారట. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అనే కారణంతో చేత చోటా నాయకులు, కార్యకర్తలు తమ భావాలను వ్యక్తపరచుకునేందుకు మన బాబుగోరు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదట.
మన బాబుగోరికి అధికారం ఉంటే.. సింగ్ పూర్ లాంటి నగరాల్ని ఎలా నిర్మించాలా అని ఆలోచిస్తుంటారు. అయితే ఆ నగరాలూ కట్టేలోపే బాబు అధికారం పోతుంది అనుకొండి అది వేరే విషయం. ఇక ప్రస్తుతం ముఖ్యంగా పార్టీని నమ్ముకుని ఉన్న కింది స్థాయి నాయకులు అసంతృప్తితో పార్టీని వీడుతున్నారని దాన్ని ఆపటం ఎలా అని బాబు తల పట్టుకున్నారట. ఎలాగూ యువకులు టీడీపీకి ఎప్పుడో దూరం అయ్యారు. ఇప్పుడు మిగిలి ఉన్న ఆ ముసలాముతక కూడా పోతే ఇక బాబుగోరు పరిస్థితి అధోగతే. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే.. బాబును పక్కాగా దెబ్బ కొట్టాలని వైసీపీ అగ్ర నాయకత్వం కసితో రగిలిపోతుందట. కానీ టీడీపీను పూర్తిగా నాశనం చేయడం సాధ్యమేనా..? ఇప్పటికే టీడీపీని అభిమానించే వాళ్ళు 40 శాతం ఉన్నారు, వాళ్ళంతా మొన్న ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశారు. ఐతే భవిష్యత్తులో పసుపు జెండా ఎగిరినా.. అప్పటికే బాబు కథ ముగిసిపోయి ఉంటుంది.