Home Andhra Pradesh తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ‘గెడ్డం’ రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల్లో జోరుగా ‘గెడ్డం’ రాజకీయాలు

- Advertisement -

పురాణాలలో, చరిత్రలో శపథం చేసేందుకు జట్టు ను బాగా వాడుకున్నారు. చాణక్యుడి శపథం మనకు తెలిసిందే.  ద్రౌపది తన ప్రతీకారం తీరేదాకా జుట్టు ముడేసేదే లేదని ప్రతిజ్ఞ చేయడమూ మనకు తెలుసు. ఆ రోజుల్లో ఆడోళ్లు మగోళ్లు ఇద్దరు జుట్టు పెంచుకునేవారు  కాబట్టి ఇలా చేయడం సాధ్యమయింది. ఇపుడు మగవాళ్లకు  జుట్టుఉండదు. ఒక వేళ ఉండినా శపథం చేసే వయసొచ్చేసరికి అది వూడి  బట్టతల రావచ్చు. అందువల్ల జుట్టు శపథాలకు ఇవి  రోజులు కావు.  విదిలించి, కళ్లెర్ర చేసి మరీ శపథం చేసేందుకు జుట్టు మగవాళ్లకు పనికిరాకుండా పోతున్నది.అదువల్ల అల్టర్నేటివ్ వెదుక్కెోవలసి వస్తున్నది. దీనికి గెడ్డం అనువయిందని అన్ని పార్టీల వాళ్లు గ్రహించారు. దీనితో తెలుగు రాష్ట్రాలలో గెడ్డం రాజకీయాలు మొదలయ్యాయి. ఇంతకు మునుపు ప్రాజక్టుల కోసం గెడ్డం పెంచిన వాళ్లున్నారు. వాళ్లెవరూ రాజకీయ పార్టీల వాళ్లు కాదు, కర్నూలు జిల్లాలో గుండ్ల బ్రహ్హేశ్వరం  ప్రాజక్టు వచ్చే దాకా గెడ్డం తీసేది లేదని శివ భాష్యం దాపు  రెండుదశబ్దాలు గెడ్డం పెంచాడు. ఆయన ఇపుడు లేరు. ప్రాజక్టు కార్యరూపం దాల్చింది. ఒక మహర్షిలాగా బతికిన శివ భాష్యం పేరే ఆ ప్రాజక్టుకు పెట్టారు. ఇలాగే తెలంగాణాలో జలదీక్షలపేరుతో దుశ్చర్ల సత్యనారాయణ గెడ్డం పెంచాడు. ఎన్నో ప్రాజక్టులు కార్యరూపం దాల్చేందుకు ఆయనేకారణం. వీళ్లు పార్టీలా కు అతీతంగా గెడ్డంపెంచారు. అయితే, ఇపుడు గెడ్డం రాజకీయ ఆయుధం అయింది. మరొక వైపు  ఇలా గెడ్డాన్ని రాజకీయాలకు వాడుకోవడం గిట్టని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లంతా గెడ్డం  రాజకీయాలను వెటకారం చేయడం కూడా జరుగుతూ ఉంది.

 మొన్నా మధ్య  తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గెడ్డం బాగా వివాదాస్పదమయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి  ఎలాగైనా సరే  2019ఎన్నికల్లో టిఆర్ ఎస్ ను గద్దె దించుతానని గెడ్డం మీద ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నానని  ఇలా వూరికే చెబితే నమ్మరుకాబట్టి, ఆయన ఏకంగా ఇలా  గెడ్డం ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే దాకా తానసలు  గెడ్డం తీసేసే ప్రసక్తే లేదుపొమ్మన్నారు. ఉత్తం ఎయిర్ ఫోర్స్ నుంచి రాజకీాయల్లోకి వచ్చిన వ్యక్తి.  చాలా డిసిప్లిన్డ్ గా కనిపించడం, దుస్తులేసుకోవడం, నీట్ గా గెడ్డం గీక్కోవడం ఆయన అలవాటు.

అలాంటి వ్యక్తి ఇపుడు రాజకీయ లక్ష్యం కోసం గెడ్డం పెంచి ముందుకెళ్తున్నారు. గెడ్డం ప్రతిజ్ఞతర్వాత ఆయన కార్యక్రమాలు ఉధ‌ృతమయ్యాయి. ఆయన్ని తీసేసి మరొక వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా  నియమించాలన్న క్యాంపెయిన్ చల్లారిపోయింది.  ఆయన వ్యతిరేకలందరి నోర్లను కాంగ్రెస్ మూయించింది, వచ్చే ఎన్నికల దాకా ఆయనే పిసిసి అధ్యక్షుడని ప్రకటించింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందో లేదో తెలియదు గాని, గెడ్డం ప్రతిజ్ఞ తర్వాత కాంగ్రెస్ లో వాతావారణం ఆయనకు అనుకూలంగా మారింది.అయితే,  ఉత్తమ్ గెడ్డం మీద  రూలింగ్ పార్టీ వోళ్లు మాత్రం తెగ జోక్స్ పేల్చారు. మంత్రి కెటిఆర్ కూడా ట్వీటెక్కారు. ఇలా గెడ్డం ప్రతిజ్ఞను హేళన చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ వాళ్లు ఎదురు తిరిగాక ఈ సద్దమణిగింది. ఉత్తమ్ గెడ్డానికిపుడు 10 నెలలు.

సిఎం రమేష్ గెడ్డం ప్రతిజ్ఞ

ఈరోజు ఆంధ్రలో మరొక ప్రముఖ నాయకుడు గెడ్డం మీద ప్రతిజ్ఞ చేశారు. ఆయనెవరో కాదు, ఈ మధ్యనే కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరాహార దీక్ష  చేసిన విరమించిన టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్.  సోమవారం ఉదయం ఆయన తిరుమలలో గెడ్డం ప్రతిజ్ఞ చేశారు. కడప స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన రాయి అదే పునాది రాయి పడేదాకా తాను గెడ్డం గీకేదేలేదని ప్రకటించారు. ఈరోజు ఆయన పొద్దునే విఐపిదర్శనం చేసుకున్నారు. అప్పటి కే ఆయనకు గెడ్డం పెరిగి ఉంది.   ఈ గెడ్డం చూపిస్తూ ఇది తన దీక్ష పర్యవసానం అన్నారు. తాను నాటి దీక్ష విరమించలేదని, ఘనపదార్ధాలు తీసుకోవడం  లేదని, కేవలం ద్రవాల మీద బతుకుతున్నాని చెబుతూ ఇది దీక్షను కొనసాగిస్తున్నట్లే నని ఆయన వాదించారు. పదకొండు రోజుల దీక్ష తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపచేశాక ఆయన ఇంకా ఘనాహారం తీసుకోవడం లేదట.‘ రెండు నెలల్లో కేంద్రం నుంచి కడప ఉక్కు మీద ప్రకటన రావాలి. అలా కాని పక్షం  రాష్ట్రం  50 :50శాతం ఈక్విటీ నిష్పత్తిలో ఏర్పాటుచేసేందుకు ముందుకు వస్తుందని కేంద్రానికి తెలియ చేస్తాం. అదీ కాకపోతే, రాష్ట్రమే స్వయంగా  ప్లాంట్ ఏర్పాటుచేస్తుంది.  ఏది ఏమయినా స్టీల్ ప్లాంట్ కు పునాది రాయి పడేదాకా గెడ్డం తీసేసి లేదని ఆయన ఖరాకండిగా చెప్పారు.

Advertisement

Advertisement

- Advertisement -

Related Posts

రానున్న రోజుల్లో బాబు, జగన్ లు మోడీ నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారా!!

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా భయపెట్టవచ్చు, ఎవరు ఎవరికైనా భయపడవచ్చు. అయితే ఇప్పుడు భారత రాజకీయాల్లో మాత్రం బీజేపీని, బీజేపీ నాయకులను చూసి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులు,...

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ధరల్ని తగ్గించేయటంతో మందు బాబుల సంబరాలు !

ఏపీలో మందబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.. మద్యం ధరల్ని తగ్గించింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలు తగ్గాయి. రూ.250-300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 తగ్గించిన ప్రభుత్వం. ఐఎంఎఫ్‌ఎల్...

సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీలో సాధ్యం కాని పని: రఘురామకృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం పాలసీపై ఆయన ఈసారి వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల శ్రమను మద్యం వ్యాపారులు...

Recent Posts

ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నాకేంటి.. పునర్నవిపై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి జంట గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. రాహుల్ అంటే పునర్నవి గుర్తుకు వస్తుంది.. పునర్నవి అంటే రాహుల్‌కు గుర్తుకు వస్తుంది. అది అంతే. ఎందుకంటే...

పుష్ప సినిమా రష్మిక మందన్న కి బాలీవుడ్ అవకాశాలు వచ్చేలా చేస్తుందా ..?

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో బ్యాట్రిక్ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్...

అనుష్క మీద నిశ్శబ్ధం ఎఫెక్ట్ ఇంకా ఎన్నాళ్ళు ..?

స్వీటీ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అరుంధతి సినిమా తర్వాత...

పాపం నోయెల్…అనారోగ్యంతో బిగ్ బాస్ నుండి వీడ్కోలు , త్వరగా తిరిగి రావాలి అంటున్న బిగ్ బాస్ కోరికని తీరుస్తాడా?

బిగ్ బాస్ షో లో టైటిల్ విన్నర్ కాగల సత్తా ఉన్న వారిలో నోయెల్ ఒకరు, అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా నోయెల్ బిగ్ బాస్ నుండి బయటకి...

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం ధరల్ని తగ్గించేయటంతో మందు బాబుల సంబరాలు !

ఏపీలో మందబాబులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది.. మద్యం ధరల్ని తగ్గించింది. మీడియం, ప్రీమియంలో 25శాతం వరకు ధరలు తగ్గాయి. రూ.250-300 వరకు ఉన్న మద్యం ధరపై రూ.50 తగ్గించిన ప్రభుత్వం. ఐఎంఎఫ్‌ఎల్...

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో న్యాయం కోసం మంత్రి హరీశ్ రావును నిలదీసిన అప్పన్ పల్లి గ్రామ ప్రజలు

తెలంగాణ: దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు చేదు అనుభవం ఎదురైంది. దుబ్బాక మండలం అప్పన్ పల్లి గ్రామంలో మంత్రి హరీశ్ రావును స్థానికులు అడ్డుకున్నారు. మల్లన్న...

సంపూర్ణ మద్యపాన నిషేధం ఏపీలో సాధ్యం కాని పని: రఘురామకృష్ణంరాజు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మద్యం పాలసీపై ఆయన ఈసారి వ్యాఖ్యానించారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రజల శ్రమను మద్యం వ్యాపారులు...

నాగబాబు బర్త్ డే.. కాబోయే అల్లుడి స్పెషల్ విషెస్!

మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా విషెస్ చెప్పినా మెగాస్టార్ చిరంజీవి, కూతురు నిహారిక, కొడుకు...

కాంగ్రెస్ లోనే ఉండాలంటే.. రాములమ్మ డిమాండ్స్ ఇవేనట..?

తెలంగాణలో ఓవైపు దుబ్బాక ఉపఎన్నిక గురించి చర్చ నడుస్తుంటే.. మరోవైపు విజయశాంతి పార్టీ మార్పు గురించి మరో చర్చ నడుస్తోంది. ఆ పార్టీ మారుతున్నారనే వార్తలు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారాయి. నిజానికి విజయశాంతి...

Movie News

ఎవరిదో ఎంగేజ్మెంట్ అయితే నాకేంటి.. పునర్నవిపై రాహుల్ సెన్సేషనల్ కామెంట్స్

బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పునర్నవి జంట గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. రాహుల్ అంటే పునర్నవి గుర్తుకు వస్తుంది.. పునర్నవి అంటే రాహుల్‌కు గుర్తుకు వస్తుంది. అది అంతే. ఎందుకంటే...

పుష్ప సినిమా రష్మిక మందన్న కి బాలీవుడ్ అవకాశాలు వచ్చేలా చేస్తుందా...

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా 'పుష్ప'. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో బ్యాట్రిక్ సినిమాగా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుండగా మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్...

అనుష్క మీద నిశ్శబ్ధం ఎఫెక్ట్ ఇంకా ఎన్నాళ్ళు ..?

స్వీటీ అనుష్క శెట్టి నటించిన నిశ్శబ్ధం సినిమా గురించి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూశారు. అరుంధతి సినిమా తర్వాత...

పాపం నోయెల్…అనారోగ్యంతో బిగ్ బాస్ నుండి వీడ్కోలు , త్వరగా...

బిగ్ బాస్ షో లో టైటిల్ విన్నర్ కాగల సత్తా ఉన్న వారిలో నోయెల్ ఒకరు, అంతా బాగానే సాగుతుంది అనుకుంటున్న తరుణంలో ఊహించని విధంగా నోయెల్ బిగ్ బాస్ నుండి బయటకి...

నాగబాబు బర్త్ డే.. కాబోయే అల్లుడి స్పెషల్ విషెస్!

మెగా బ్రదర్ నాగబాబు బర్త్ డే నేడు (అక్టోబర్ 29). ఈ మేరకు సోషల్ మీడియాలో విషెస్ వెళ్లువెత్తుతున్నాయి. ఎవరు ఎంత గొప్పగా విషెస్ చెప్పినా మెగాస్టార్ చిరంజీవి, కూతురు నిహారిక, కొడుకు...

దీపికా మేనేజ‌ర్ ఇంట్లో సోదాలు.. ఎన్సీబీకి దొరిక‌న మాద‌క ద్రవ్యాలు..ప‌రారీలో కరిష్మా

బాలీవుడ్ న‌టుడు సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం త‌ర్వాత బాలీవుడ్‌లో డ్ర‌గ్స్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. హీరోయిన్ రియా చక్రవర్తి వాట్సాప్ చాటింగ్ ఆధారంగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో.. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్...

అదే నిజమైతే ఛీ కొడతారు.. పునర్నవిపై నెటిజన్లు ఫైర్!!

బిగ్ బాస్ ఫేమ్ పునర్నవి నిన్నటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. నిశ్చితార్థం జరిగినట్టు బిల్డప్ ఇస్తూ ఫోటోలను షేర్ చేస్తూంది. ఎంగేజ్మెంట్ రింగ్ అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. తాజాగా మరో...

‘పుష్ప’తో బన్నీ అల్లకల్లోలమే.. నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్

మెగా బ్రదర్ నాగబాబుకు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన అభిమానం. బన్నీకి కూడా నాగబాబు అంటే ఎంతో మక్కువ చూపిస్తాడు. చిరంజీవిని ఏమైనా అంటే ఊరుకోని తత్త్వమే నాగబాబులో బన్నీకి...

యాంక‌రింగ్ అనుభవం లేదు, తెలుగుపై ప‌ట్టు లేదు.. మామ వ‌ల్ల‌నే ఇది...

‌అక్కినేని నాగ చైత‌న్య‌ని వివాహం చేసుకొని అక్కినేని కోడ‌లి ప్ర‌మోష‌న్‌ను అందుకున్న స‌మంత వారి పేరు నిల‌బెడుతుంది. చేసిన ప్ర‌తి ప‌నిలో స‌క్సెస్ సాధిస్తూ అక్కినేని ఫ్యామిలీకి త‌గ్గ కోడ‌లు అనిపించుకుంటుంది. ఇప్ప‌టికే...

యాంకర్‌గా చేసిన ప్లేస్‌లో గెస్ట్‌గా.. భానుశ్రీ బాగానే హర్టైనట్టుంది!!

బొమ్మ అదిరింది షో ఎంతటి వివాదానికి దారి తీసిందో అందరికీ తెలిసిందే. మొదటి ఎపిసోడ్‌లో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్‌తో షోను ఎక్కడికో తీసుకెళ్లారు. జగన్ అభిమానులందరూ ఈ షోను...