HomeAndhra Pradeshతాగుబోతుల బూతులకు జగన్ ఊతం !

తాగుబోతుల బూతులకు జగన్ ఊతం !

 
ముఖ్యమంత్రి కాకముందు ‘వై ఎస్ జగన్’ పై చాల అనుమానాలు.. కానీ ఇపుడు జగన్ తీసుకుంటున్న  సంచలనాత్మక  నిర్ణయాలు ఏపీ రాజకీయ వర్గాల్లోనే సంచలనంగా మారుతున్నాయి. నిజానికి మొదట్లో జగన్ దూకుడు చూసి కొత్త కదా.. ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనుకున్నారు అందరూ. కానీ జగన్ ప్లాన్ లు.. ఆర్ధికపరమైన లావాదేవీల గురించి జగన్ కున్న అవగాహన చూస్తుంటే.. ముచ్చట వేస్తోంది. రాబోయే కాలంలో కూడా అధికారం తనకే దక్కేలా పథకాలు రూపొందిస్తున్నాడు.  మరో పక్క ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి పడేస్తున్నాడు.
 
అయితే సోషల్ మీడియాలో మద్యం బాబులు తన పై రెచ్చిపోతున్నా.. వారి ఆక్రోశాన్ని జగన్ ఎంతమాత్రం పట్టించుకోవట్లేదు. నిజానికి మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి,  గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం ధరలను 75 శాతం పెంచి, తాగుబోతుల  బూతులకు ఊతం ఇచ్చారు.  పైగా అంత డబ్బు పెట్టినా  మద్యం బాబులు కోరుకున్న బ్రాండ్లు దొరకకుండా చేశాడు. బూమ్‌ బూమ్‌, బామ్‌ బామ్‌ అంటూ ఎప్పుడూ వినని బ్రాండ్లను తీసుకొచ్చి మత్తుగాళ్ళను చిత్తు చిత్తూ చేశాడు.  
 
ఏది ఏమైనా  జగన్ కు ఇప్పుడు తిరుగులేదు. తనకు అండగా నిలబడిన బడుగు, బలహీనవర్గాలకే  తనరాజ్యం అన్నట్లుగా జగన్ వ్యవహారశైలి ఉంటుంది. పైగా తన రాజకీయ ప్రయోజనం కోసం జగన్ దగ్గర చాలా ప్రణాళికలే ఉన్నాయి.  
 

Related Posts

Gallery

Most Popular

Polls

Latest News