నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేలతో చిక్కులు తెచ్చుకుని, ఇప్పటికీ పట్టు సాధించలేక పోయిన టీడీపీ అ ధినేత చంద్రబాబుకు.. ఇప్పుడు ఎమ్మెల్సీలతో పెద్ద పెట్టున తలనొప్పులు వస్తున్నాయి. తాజాగా ఆయన శా సన మండలి సభ్యులను కాపాడు కోవడం పెను సవాలుగా మారింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కీలక మైన రాజధాని, సీఆర్ డీఏ బిల్లులు మండలి నుంచి సెలక్ట్ కమిటీకి వెళ్లాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డ కష్టం వచ్చిందని వైసీపీ నాయకులు భావిస్తున్నారు. ఇక ఇప్పుడు మండలి కూడా రద్దు చేసేందుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
ప్రస్తుతానికి వైసీపీ చేసిన ప్రకటన వ్యూహమే! ఈ వ్యూహానికి కారణం ఉంది. టీడీపీకి మండలిలో మెజారిటీ ఉంది. 28 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇప్పుడు వీరిలో సగం మంది వైసీపీకి అనుకూలంగా మారితే.. ప్రభుత్వ పని పూర్తవుతుంది. ప్రస్తుతం సెలక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లును రద్దు చేస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించి దానిని వెనక్కి తీసుకుంటుంది. దీంతో బిల్లు రద్దు అయింది కనుక మండలి చైర్మన్ చేసిన సెలక్ట్ కమిటీ ప్రకటన కూడా రద్దువుతుంది.
ఆ వెంటనే బిల్లును చిన్నపాటి మార్పులతో మరోసారి అసెంబ్లీలో ప్రవేశ పెట్టుకుని, మళ్లీ మండలికి పంపితే.. అక్కడ ఎలాగూ.. ఓ 14 మంది టీడీపీ సభ్యులు వైసీపీకి అనుకూలంగా ఓటేస్తే.. పనిసులువు అవుతుందని వైసీపీ భావిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే రెండు రోజులుగా టీడీపీ ఎమ్మెల్సీలతో వైసీపీ నాయకులు, మంత్రులు.. కొంచెం.. టచ్లో ఉంటే చెప్తా! అని అంటున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం టీడీపీ సభ్యులతో చంద్రబాబు భేటీ అయ్యారు. దీనికి ముందు ఆయన హైదరాబాద్ నుంచి అందరూ ధైర్యంగా టీడీపీ పక్షాన నిలబడాలి.. లేకుంటే మీకు భవిష్యత్తు కూడా ఉండదంటూ.. హెచ్చరించారు.
అయితే, ఆదివారం నాటి సమావేశానికి అందరికీ ఆహ్వానం అందినా.. దాదాపు ఐదుగురి నుంచి చంద్రబాబు సమాధానం లేదు. అయితే, వీరంతా కూడా వైసీపీతో టచ్లో ఉన్నారా? మరింత మంది పరిస్థితి ఏంటి? అనే సందేహాలు చంద్రబాబును కలచి వేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేల విషయంలో తీవ్ర ఇరకాటం అనుభవించిన చంద్రబాబు ఇప్పుడు ఎమ్మెల్సీల పరిణామంపై తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.