అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదన్నారు. అధికారపార్టీ ఎంఎల్ఏలు అధికారులపై దాడులు చేసినపుడు దగ్గరుండి తానే పంచాయితీలు చేశారు. చివరకు అధికారులదే తప్పంటూ ప్రజా ప్రతినిధులను వెనకేసుకొచ్చారు. ప్రతిపక్ష నేతల్లో కొందరు హత్యకు గురైనపుడు ఎంత గోల జరిగినా కనీసం స్పందిచ లేదు. అంతెందుకు సర్వ వ్యవస్ధలను ఏదేళ్ళల్లో గబ్బు పట్టించేశారు.
చివరకు ప్రధాన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగినపుడు కూడా అవహేళన చేశారు. అలాంటి చంద్రబాబునాయుడు ఇపుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ఆందోళన పడుతున్నారు. ప్రతిపక్షంపై అధికారపక్షం దాడులు చేస్తున్నా, హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నా పట్టించుకోరా ? అంటూ మండిపోతున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు చలో ఆత్మకూరు అంటూ నినాదం ఇచ్చారు. చలో ఆత్మకూరు అంటే వైసిపి బాధితులను అందరినీ ఒకచోట చేరుస్తారట. ఆత్మకూరు గ్రామాన్ని వదిలేసిన టిడిపి కార్యకర్తలను తిరిగా గ్రామంలోకి తీసుకెళతారట. నిజంగా చంద్రబాబు పిలుపు పెద్ద జోక్ లాగ తయారైంది. తాను అధికారంలో ఉన్నంత కాలం ప్రతిపక్ష వైసిపిని గుర్తించటానికి కూడా ఇష్టపడలేదు. జగన్ ను అసలు ప్రతిపక్ష నేతగానే తాము గుర్తించమన్నట్లుగా వ్యవహరించారు.
అలాంటి చంద్రబాబు ఇపుడు కథలు మాట్లాడుతున్నారు. నిజానికి చంద్రబాబు ఆరోపిస్తున్నంతగా రాష్ట్రంలో టిడిపి నేతలపై దాడులు జరగలేదు. ఎక్కడైనా జరిగినా అవి వ్యక్తిగత కక్షలతో జరిగినవే. జగన్ నూరు రోజుల పాలన ఓవరాలుగా తీసుకుంటే బాగానే ఉందనే చెప్పాలి. దాన్నే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నేతలు టిడిపిని వదిలేయకుండా కాపాడుకునేందుకే చంద్రబాబు నానా గోల చేస్తున్నారు.