జగన్ పై టార్గెట్ కి బాబు కొత్త ప్లాన్ !

 
మోదీని  ఎలాగైనా సరే ఈ సారి  ప్రధానమంత్రి కాకుండా చూడటమే తన లక్ష్యం అన్నట్లు బాబు అప్పట్లో బిజీ బిజీగా  తిరిగాడు.  కానీ ఏం లాభం ? చివరికి బాబుగారే ఓడిపోయారు. అయితే  గెలుపు ఓటమి అనేవి బాబుగారికి కొత్త కాదు.. నిజానికి ఓడిపోయాకే ఆయన టీడీపీలోకి ఎంటర్ అయ్యారు. మళ్లీ గెలిచేదాకా పనిచేయడం బాబుకి వ్యసనం. అందుకే గెలుపు కోసం మళ్లీ బీజేపీకి దగ్గర అవుతున్నారు.  ఎలాగూ రాష్ట్రంలో వైసీపీని తట్టుకొని నిలబడాలంటే  బీజేపీ సపోర్ట్ బాబుకి కావాలి.  అలాగే ఆంధ్రాలో బీజేపీ నిలబడాలంటే..  బాబు సపోర్ట్ బీజేపీకి కావాలి. అందుకేనేమో  రెండు పార్టీల మధ్య సంధి కుదిరుతునట్లు అనిపిస్తుంది. కుదరకపోయినా  కూర్చుకోవడానికి బాబు విశ్వప్రయత్నం చేస్తున్నాడు.   

 

ఏమైనా మళ్లీ బాబు సీఎం అవ్వటానికి బాగానే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఎంతైనా ఎడారిలో సైతం  అవసరం అయితే  నీళ్లను  సంపాధించేంత ఓపిక తెలివితేటలు బాబుకు ఉన్నాయి.  బాబు చేసిన త‌ప్పుల‌ను స‌వ‌రించుకుని పక్కా ప్ర‌ణాళిక‌లతో ముందుకు వెళ్తే.. ఖచ్చితంగా బాబు మళ్లీ సీఎం అవ్వొచ్చు అనే ఆశ బాబుకు ఉంది. కానీ బాబును ప్రజలు నమ్మడం మానేసారు. అందుకే జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకం పోగొట్టడానికి లేనిపోని ఆరోపణలతో బాబు ముందుకు వెళ్తున్నాడు.
 
 
తాను ఒక్కడే జగన్ ను తిడితే  జనం నమ్మరు అనుకున్నాడేమో  కన్నా లాంటి వారి చేత కూడా జగన్ ను తిట్టిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ప్లాన్ తోనే ముందుకు వెళ్తున్నాడు. వైసీపీ ఏడాది పాలనలో ఎక్కడా శాంతి భద్రతలు లేవని..  ఈ ఏడాది  పుణ్యమా అని,  ప్రజలందరూ   ‘వైకాపా ప్రభుత్వ బాధితులుగా  మిగిలారని  బాబు జగన్ ను బాగానే టార్గెట్ చేస్తున్నాడు.