జగన్ పాలన తీరుకు తిరుగులేదు !

 
దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వమే కరోనా  లాక్ డౌన్ తో కుదేలై  దేశ ఆర్థిక వ్యవస్థ విషయంలో  చేతులెత్తేసింది.  ఆదాయం లేక దేశ ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాలు ఇక పై ఉండవని.. భవిష్యత్తులోనూ రూపొందించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది.  పైగా ఉన్న పథకాలను కూడా  కేంద్రం,  రాష్ట్రాలకే అప్పగించడం పై  ఇప్పటికే అన్ని రాష్ట్రాల సీఎంలు మండిపడ్డారు.  అయినా కేంద్రం చేతులెత్తేసినా జగన్ మాత్రం మొండి ధైర్యంతో ఏపీ ప్రజలకు సేవలందించేందుకు ముందుకెళ్తుతున్నారు. ఒకవైపు కరోనా విపత్తు ఉన్నా  దేశంలోనే అత్యధిక టెస్టులు చేస్తూ ఏపీని శిఖరాగ్రాన జగన్ నిలిపడం,  మరోవైపు లోటు బడ్జెట్ వెక్కిరిస్తున్నా..  ఏపీ ప్రజలకు తాను ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి లోటు రాకుండా ముందుకు వెళ్ళడం  ఒక్క జగన్ కే సాధ్యం అయింది.    
 
అయినా కరోనా విపత్తుతో సంబంధం లేకుండా ఇంతటి కష్టకాలంలోనూ జగన్ సంక్షేమ పథకాలను ఎలా అమలు చేస్తున్నాడు ! పక్కరాష్ట్రంలో తెలంగాణలో ఉద్యోగులకు సగం జీతాలిస్తున్నారు, దేశంలోనే ధనిక రాష్ట్రం సీఎం కేసీఆర్. కానీ  ఏపీ సీఎం జగన్ మాత్రం ఫుల్ జీతాలు ఇస్తూ అందరి చేత శభాష్ అనిపించుకోవడం అంటే మాటలు కాదు.  కేంద్రం తన నిధులను పొదుపుగా వాడుకుంటూ బడ్జెట్ లో మార్చిలో ప్రకటించిన కొత్త పథకాలకు కూడా మంగళం పాడి ఆడిన మాట తప్పింది.
 
కానీ కేంద్రం, తెలంగాణ కంటే దుర్భర లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థకు వెరవకుండా సీఎం జగన్ నవరత్నాలతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. ఎక్కడా ఎవరికి కోత రాకుండా పేదలకు ఇంతటి విపత్తులోనూ పథకాలను అందిస్తుండడం చూసి ప్రజలే ఆశ్చర్యపోతున్నారు.  ఏమైనా జగన్ పాలనతీరుకు తిరుగులేదు.