ఏపీ సీఎం జగన్ తన రాజకీయ ప్రత్యర్థి మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిని వదలడం లేదా ? చంద్రబాబుతో జట్టుకట్టి గతంలో జగన్ పై దారుణ విమర్శలు చేసిన జేసీ ఇప్పుడు అనుభవిస్తున్నాడని పొలిటికల్ సర్కిల్స్ లో జోక్స్ వినిపిస్తున్నాయి. జేసీ దివాకర్ రెడ్డి ప్రధాన బిజినెస్ అయిన జేసీ ట్రావెల్స్ పై జగన్ అధికారం రాగానే దెబ్బకొట్టారు. జేసీ బస్సుల అక్రమాలు నిగ్గుతేల్చి సీజ్ చేసి అనంతరం రాజకీయంగానూ ఆయనను దెబ్బ తీశారు. జేసీ వర్గానికి ముఖ్యడైన తాడిపత్రిలో బలమైన నాయకుడైన షబ్బీర్ అలీని వైసీపీలో చేర్చుకుని జేసీకి షాక్ ఇచ్చారు.
తమ ప్రధాన అనుచరుడే పార్టీ మారడంతో జేసీ బ్రదర్స్ ను కోలుకోనీయకుండా చేసిందట. జగన్ పక్కా ప్లాన్ ప్రకారం అనంతపురంలో జేసీ పునాదులు కదిల్చడానికే ఇదంతా చేస్తున్నారని, అందులో భాగంగానే జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సుల పై ఉక్కుపాదం మోపారని.. తాడిపత్రిలో జేసీ లారీ వ్యాపారాలకు సైతం చెక్ పెట్టారని, జగన్ దెబ్బలతో జేసీ నిలబడే పరిస్థితి లేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ప్రయాణికుల జీవితాలతో జేసీ ట్రావెల్స్ చెలగాటం ఆడిందని అనంతపురం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ శివరాంప్రసాద్ తెలిపారంటే.. జగన్ సపోర్ట్ లేకుండా ఆయన అల పర్సనల్ కామెంట్స్ చేయరు కదా.. ఈ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఫోర్జరీ వ్యవహారం పై జేసీ కుటుంబ సభ్యులకు నోటీసులు కూడా అందజేశారు.
మొత్తానికి జేసీ బ్రదర్స్ పై జగన్ పంతం పట్టారు. ఇంటా బయటా వాళ్ల వ్యాపారాలను, రాజకీయ బలాన్ని టార్గెట్ చేసి వారిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఏమైనా జగన్ గెలుపు జేసీ బ్రదర్స్ పతనానికి పునాదిలా మారింది.