గొప్ప పథకం విషయంలో వెనకడుగు వేసిన జగన్

cm jagan mohan reddy n

 జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు ప్రతి నెల ఎదో ఒక కొత్త పథకాన్ని అమలుచేస్తునే ఉన్నాడు. ఒక పక్క రాష్ట్రము అప్పులమయం అవుతున్న కానీ, మరోపక్క ప్రజా సంక్షేమం కోసం సీఎం కొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నాడు. ఇందులో భాగంగా ఇంటింటికి రేషన్ అనే సరికొత్త పధకాన్ని ప్రారంభించి జనవరి 1వ తేదీ నుండి అమలుచేయాలని భావించాడు.

door step restion
door step restion

 అందుకోసం ఇప్పటికే ప్రభుత్వం కసరత్తులు పూర్తి చేసింది. రేషన్ సరకులు అందించడానికి వాహనాలు సిద్ధం చేసింది, డ్రైవర్ పోస్ట్ ల భర్తీని కూడా చేపట్టింది, సరకుల ప్యాకింగ్ కూడా జరుగుతోంది. కానీ అసలు విషయంలో చిక్కొచ్చి పడింది. పోర్టబిలిటీ విధానాన్ని ఉపయోగించుకుని ఇప్పటికే చాలామంది వేర్వేరు ప్రాంతాల్లో రేషన్ సరుకులు తీసుకుంటున్నారు. సొంతూరిలో లేకపోయినా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉండటంతో.. కుటుంబ సభ్యుల్లో ఎవరు ఏ ప్రాంతంలో ఉన్నా వేలిముద్ర వేసి సరుకులు తెచ్చుకుంటున్నారు. ఇంటింటికీ రేషన్ అంటే ఆ వెసులుబాటుని తీసేసినట్టే లెక్క.

 చాలా చోట్ల లబ్ధిదారుల జాడ తెలియక చాలా చోట్ల రేషన్ కార్డుల మ్యాపింగ్ జరగలేదు. ఒకవేళ పట్టుబట్టి జనవరి 1 నుంచి ఇంటింటికీ రేషన్ చేరవేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా.. తొలి నెలలోనే దాదాపు 20 శాతం మంది రేషన్ తీసుకునే అవకాశం కోల్పోతారు. 80 శాతం మందికి ఉపయోగం ఉన్నా కూడా 20 శాతం మంది పేదల శాపనార్థాలు తగులుతాయి. అందుకే అధికారులు ఓ అడుగు వెనక్కి వేశారు. ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. దీనికి సంబంధించి రేషన్ డీలర్లకు అనధికారికంగా సమాచారం వెళ్లింది. వాలంటీర్ల శిక్షణా కార్యక్రమాలు, సమీక్షలు వాయిదా పడటంతో ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఆగిపోయినట్టు అర్థమవుతోంది.

 దీన్ని నిరంతర ప్రక్రియగా మార్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి అమలులోకి తేవాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. దానికి అనుగుణంగానే అంతా సిద్ధమైంది. అయితే అనుకోకుండా చివరి నిమిషంలో ఇంటి వద్దకే రేషన్ కార్యక్రమం ఆగిపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాకుళంలో పైలెట్ ప్రాజెక్టు గా దీనిని అమలుచేస్తున్నారు. ఇప్పటికి ప్రారంభం అయ్యి. మూడు నెలలు అవుతున్న కానీ ఇప్పటికి అనేక సమస్యలు వస్తున్నాయి. వాటిని కూడా పరిశీలించి మరికొద్ది రోజులో దీనిపై మరో ప్రకటన చేసే అవకాశం ఉంది