ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సరిసమానంగా అభివృద్ధి చేయాలనే సాకుతో జగన్ తీసుకున్నటువంటి వివాదాస్పద నిర్ణయం.. ఒక్క రాష్ట్రానికి మూడు రాజధానులు. కాన్సెప్ట్ ఇంట్రస్టింగ్ గా ఉన్న సాధ్యసాధ్యాలు ఎంత కష్టమో.. రాజధాని తరలింపు అనే అంశం చుట్టు ఎంతటి గొడవలు జరిగాయో.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినా జగన్ మాత్రం రాజధానిని, అమరవాతి నుండీ తరలించి విశాఖలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నారు.
దాంతో అమరావతి నిర్మాణం కోసమని తమ భూములను ఇచ్చిన రైతులు, అక్కడి ప్రజలు కరోనా కష్టకాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి ఉద్యమం మరొక మైలురాయిని చేరుకుంది. దేశ వ్యాప్తంగా విస్తరిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఏర్పాటు చేసినటువంటి లాక్ డౌన్ చాలా కఠినంగా అమలులో ఉన్నప్పటికీ.. ఆగని ఈ ఉద్యమం నేటితో 150వ రోజుకు చేరుకుంది.
ఈ మధ్యలో వారి పై లాఠీలు ఝళిపించినా, అక్రమంగా కేసులు బనాయించినా, అరెస్టులు చేసి జైళ్లకు పంపినా… ఉద్యమం ఆగలేదు. అల అని రైతుల కష్టాలు తీరాయా ? బూటకపు మూడు రాజధానుల నిర్మాణం అంటూ నాయకులు కాలం వెళ్లబుచ్చుతున్నా.. ఇతర ప్రాంత ప్రజలు పట్టనట్టు ఎందుకు ఉన్నారు..? మాయ మాటలు చెప్పి, అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం ఇంకా జరుగుతూనే ఉంది.
ఈ నిర్ణయం తప్పు అనలేం,. ముందుగా ఒక రాజధానిని అభివృద్ధి చెయ్యాలి. ఆ తరువాత మరో రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్క రాజధాని కూడా లేని స్థితిలో మూడు అవసరమా ? ఇప్పటికైనా మూడు రాజధానుల మాట విరమించుకొని, అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ మిగిలిన ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడం ఉత్తమం. లేకపోతే జగన్ చెల్లించక తప్పదు భారీ మూల్యం.