టీడీపీ పరిస్థితి రోజురోజుకూ అతి దారుణంగా తయారవుతుంది. బాబుగోరు ఎంత బుజ్జగించినప్పటికీ తెలుగు తమ్ముళ్లు మాత్రం పార్టీ నుండి వెళ్లిపోవడానికే ఇష్టపడుతున్నారట. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. చంద్రబాబుకు వయసు అయిపోతుంది. పార్టీను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు లేడు. అందుకే బాబుగోరు చిన్న బాబుని టీడీపీ భవిష్య నాయకుడిగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఈ లాక్ డౌన్ లో అధికార పక్షాన్ని ఎదిరించే విధంగా సిద్ధం చేస్తున్నారట. చిన్న బాబు పై ప్రత్యేక దృష్టి సారించారట బాబు, అందుకే ఈ మధ్య జగన్ పై ట్విట్టర్ లో ఓ రేంజ్ లో విరుచుకుపడుతున్నారు చిన్న బాబు.
కానీ చిన్నబాబుగోరికి వచ్చిన చిక్కు ఏమిటంటే ఎంత తీవ్ర స్థాయిలో వైసీపీను అలాగే జగన్ ను తిడుతున్నా.. చిన్న బాబును కనీస స్థాయిలో కూడా పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. పైగా పప్పు అంటూ సెటైర్లు ట్రోల్ల్స్ రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. అయినా, చిన్నబాబు మాత్రం కామెడీ చెయ్యడం మానట్లేదు. వైసీపీ పై చిన్నబాబును హీరోగా మారుద్దామని బాబుగోరు విశ్వప్రయత్నాలు చేస్తుంటే.. చిన్నబాబు మంచి ఫన్ ను జనరేట్ చేస్తున్నాడు.
ఇప్పటికైనా బాబు తన పుత్ర వాత్సల్యం కట్టిపెట్టి.. పార్టీని తన తరువాత సమర్ధవంతమైన వ్యక్తి చేతిలో పెడితే.. టీడీపీకి భవిష్యత్తు ఉంటుంది. లేకుంటే.. పార్టీనే కాల గర్భంలో కలిసిపోతుంది.