రాష్ట్ర గవర్నర్ మాననీయ బిశ్వ భూషణ్ హరిచందన్ ఆంధ్రప్రదేశ్ లో ఓటు హక్కును పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ విజయవాడ మధ్య నియోజక వర్గ పరిధిలో ఉండగా గవర్నర్తో పాటు ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ సైతం ఓటరుగా నమోదు అయ్యేందుకు అవసరమైన పత్రాలను ఎన్నికల అధికారులకు అందించారు.
గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కమార్ మీనా సూచనల మేరకు నియోజకవర్గ ఎన్నికల విభాగపు ఉప తహశీల్ధార్ నాగమణి మంగళవారం గవర్నర్ దంపతులకు సంబంధించిన ఓటరు నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసారు. అప్పటి కప్పుడే వివరాలను సరిచూసుకున్న అధికారులు జిల్లా పాలనాధికారి ద్వారా రాష్ట్ర ప్రధమ పౌరునికి, వారి సతీమణికి త్వరలోనే ఓటరు కార్డును అందజేస్తామని తెలిపారు.