ఆ విషయంలో చంద్రబాబు, జగన్ ఒక్కటే !

 
గొప్ప పని చేయలేనప్పుడు  చేసిన పనినే గొప్పగా చెప్పుకోవాలని  మన పెద్దలు చెప్పారు. ఆయితే ఈ సూక్తిని సాధారణ ప్రజానీకం కంటే కూడా, మన రాజకీయనాయకులే బ్లైండ్ గా ఫాలో అయిపోతుంటారు. తాము ఏమి చేస్తే..  అదే గొప్ప ఘనకార్యం అన్నట్లు దానికి మించింది ఇక లేనట్టు ఓ రేంజ్ లో పబ్లిసిటి ఇచ్చుకుంటారు. అయితే నిజాలను పాతరేసి, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు మాయచేయడంలో  నారా చంద్రబాబు నాయుడుగారు నలభైఏళ్ల పాటు మాస్టర్ డిగ్రీ చేస్తూనే  ఉన్నారు.  మన బాబుగోరు  తాను చేసున్న పనే గొప్పదని… అందరూ దాన్నే గొప్పది  అనుకోవాలని సత్యాలను అసత్యాలుగా నమ్మించిన సందర్భాలు కోకొల్లలు. సరే బాబు కాబట్టి  ఆయన రాజకీయం అలాగే ఉంటుందని సరిపెట్టుకోవచ్చు.  కానీ విచిత్రంగా  జగన్ మోహన్ రెడ్డి కూడా  చంద్రబాబు దారిలోనే  వెళ్తుండటం కాస్త ఆశ్చర్యాన్ని కలిస్తోంది.   
 
 
బాబుగారికి  మల్లే  తన గొప్పలు చెప్పుకోవటానికి  జగన్ కూడా  కొన్ని వాస్తవాలను  దాచిపెడుతున్నాడు. ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చూపిస్తున్నాడు. పాత పథకాలనే పేర్లు మార్చి కొత్తగా సంక్షేమం అనే మార్కెట్ లోకి వదులుతున్నాడు. ఉదాహరణకు  సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన మొదటిరోజే  పెంఛన్లు 2250 ఇస్తున్నట్లు జగన్  ప్రకటించాడు,  గత ప్రభుత్వం కేవలం కొద్దీ మందికి మాత్రమే 1000 ఇచ్చారని..  కానీ  తానూ  సీఎం అయిన మొదటి నెలలోనే దానిని 2250కి పెంచుతూ నిర్ణయం తీసుకున్నానని జగన్  ఓ రేంజ్ లో పబ్లిసిటి ఇచ్చుకున్నాడు.  
  
వాస్తవానికి చంద్రబాబు  2019  జనవరిలోనే  1000 రూపాయాల పెన్షన్ ను 2000కి పెంచారనేది నిజం.  పైగా అర్హులతో పాటు అనర్హులకు కూడా అందరికీ  పెన్షన్ ను ఇచ్చారు.  అందేలా చూశారు. ఓట్లు కోసమే అనుకోండి.   అయితే  బాబు పెంచిన  పెన్షన్ ను వదిలేసి  తానే  1000 నుండి 2250కి  పెంచినట్లు జగన్ పబ్లిసిటీ చేసుకున్నాడు.  బాబు తన ఐదేళ్ల పదవి కాలంలో అంతకుముందు ఉన్న పెన్షన్ కి  10 రేట్లు పెంచాడంటే మాటలా ? కానీ  జగన్ కేవలం రెండున్నర రేట్లు మాత్రమే పెంచాడు.  మరి ఇది ప్రజలకి అర్ధం కాదా.. ఏమైనా  బాబు ఘనత కూడా తనదే అని చెప్పుకోవడం జగన్ స్థాయిని  తగ్గించేదే అవుతుంది కదా. ఒక్క ఈ పథకమే కాదు, చాల పథకాల విషయంలో జగన్ చేస్తోంది ఇదే అనే విమర్శ కూడా రోజురోజుకూ ఎక్కువవుతుంది.