అనకాపల్లి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎంవీఆర్.. గెలుపు ఖాయమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజుకుంది.  మరి కొద్ది రోజులలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో అన్ని పార్టీ నేతలు అభ్యర్థులను ప్రకటించే పనులలో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో పెద్ద ఎత్తున అలజడి రేగుతుంది. ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా ముత్యాల వెంకటరావు పోటీ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే ఈయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారా అనే సంగతి మాత్రం తెలియడం లేదు కానీ ఈయన మాత్రం ఎంపీగా పోటీ చేయబోతున్నారని తెలుస్తోంది.

 

అనకాపల్లి నియోజకవర్గంలో మాత్రమే కాకుండా ఎం.వి.ఆర్ అంటే హైదరాబాద్ తెలంగాణ బెంగుళూరు కేరళ వంటి రాష్ట్రాలలో కూడా ఈయనకు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అనకాపల్లి టు ఢిల్లీ వరకు ప్రముఖులతో ఈయనకు సత్సంబంధాలు ఉన్నాయి. ప్రముఖ వ్యాపారవేత్తగా ఈయన గత నాలుగు దశాబ్దాలుగా టెక్స్టైల్స్ రంగంలో దూసుకుపోతున్నారు.

 

ఈ విధంగా అనకాపల్లి నియోజకవర్గంలో ఏ ఒక్కరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదని భావించినటువంటి ఈయన ఎన్నో కంపెనీలను వ్యాపారాలను ప్రారంభించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇక మండలాలలో ఏ ఒక్కరికి సహాయం అవసరమైన నేనున్నాను అంటూ భరోసా ఇస్తారు పెద్ద ఎత్తున హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేసి వారందరి ఆరోగ్య బాధ్యతలను తీసుకున్నారు. ఇలా అందరికీ తలలో నాలుకలా ఉన్నటువంటి ఎంవిఆర్ ఎన్నికల బరిలోకి దిగితే ఈయన గెలుపు ఖాయమని స్పష్టంగా తెలుస్తుంది.

 

ఈయన కనుక ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే కనుక తన ఫ్యాక్టరీలలో పనిచేసే అభ్యర్థులు ఈయనకు ఓట్లు వేసి తనని గెలిపించుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే అనకాపల్లిలో కాపులు అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ నుంచి నాగబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఎంవిఆర్ ఏదైనా పార్టీలోకి చేరి ఎంపీ అభ్యర్థిగా నిలబడతారా లేకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.

 

ఇక ఈయన స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగినప్పటికీ భారీ మెజారిటీతో గెలుపొందుతారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈయన కనుక ఎన్నికల బరిలోకి దిగితే ఇతర పార్టీ నేతల గుండెల్లో గుబులు మొదలైనట్లేనని తెలుస్తోంది. మరి ఎంవిఆర్ ఎదైనా పార్టీ వైపు అయినా మొగ్గు చూపుతారా లేదంటే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి వచ్చి తన సత్తా ఏంటో నిరూపిస్తారా అనేది తెలియాల్సి ఉంది.