ఎటు వెళ్ళాలో తెలియక ఛానళ్ళన్ని తిరగేస్తున్నావ్… అందరి ముందు రవి పరువు తీసిన ఆది..!

ప్రస్తుతం బుల్లితెర ఛానల్ వారు టీవీ సీరియల్స్ కంటే స్పెషల్ ఈవెంట్స్ తోనే బాగా ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ క్రమంలో ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా స్పెషల్ ఈవెంట్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఇక ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో ఈటీవీ మల్లెమాల ఎప్పుడు ముందు ఉంటుంది. ఇక దసరా పండుగ సందర్భంగా మల్లెమాలవారు నవరాత్రి ధమాకా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ కార్యక్రమంలో ఎంతోమంది బుల్లితెర నటీనటులు మాత్రమే కాకుండా అలనాటి సీనియర్ నటులు కూడా పాల్గొని సందడి చేశారు. ఇక బుల్లితెర మీద యాంకర్ గా గుర్తింపు పొందిన రవి చాలా కాలంగా టీవీ షోస్ కి దూరంగా ఉంటున్నాడు. అయితే ఈ నవరాత్రి ధమాకా ఈవెంట్లో మాత్రం సందడి చేశాడు. ఈ కార్యక్రమంలో బిగ్ బాస్ లో పాల్గొన్న చాలా మంది కంటెస్టెంట్లు కూడా పాల్గొన్నారు. ఇక ఈ నవరాత్రి ధమాకా కార్యక్రమం మొదలుపెట్టగానే బుల్లితెర నటీనటులు ఈ కార్యక్రమాన్ని హైదరాబాదులో నిర్వహించాలని ఒకరు అంటే లేదు విజయవాడలో నిర్వహించాలని మరొకరు గొడవపడ్డారు.

దీంతో రవి ఎంటర్ అయి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అని ఆలోచిస్తున్న సమయంలో ఆది అక్కడికి వచ్చాడు. అసలు సమస్య ఏమిటి అని ఆది అడగ్గా సెలబ్రేషన్స్ కోసం అటు వెళ్లాలా ? ఇటు వెళ్లాలా? అని ఆలోచిస్తున్నామని రవి అనగానే… ఎటు వెళ్లాలో తెలియకే అన్ని చానళ్లు తిరుగుతున్నావు అంటూ ఆది రవి మీద సెటైర్ వేసి అందరి ముందు పరువు తీశాడు. దీంతో రవికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నిజానికి బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత రవి ఏ ఒక్క ఛానల్లోనూ నిలకడగా ఉండకుండా అన్ని చానల్లో ప్రసారం అవుతున్న ఈవెంట్స్ పాల్గొంటున్నాడు. అందువల్ల రవి మీద ఆది ఇలా సెటైర్ వేశాడు.