బిగ్ బాస్ కార్యక్రమం 21 మంది కంటెస్టెంట్లతో ఆదివారం ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఇక ఈ 21 మంది కంటెస్టెంట్లను మూడు విభాగాలుగా విభజించి బిగ్ బాస్ పలు టాస్క్ లను నిర్వహిస్తూ తన గేమ్ మొదలు పెట్టాడు. ఇలా బిగ్ బాస్ మొదటివారం నామినేషన్లను కూడా ఎంతో రసవత్తరంగా కొనసాగించారు. ఈవారం నామినేషన్ లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇకపోతే ఈవారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో ఎవరు బిగ్ బాస్ వీడనున్నారనే విషయం గురించి సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి.
ఈ క్రమంలోనే నామినేషన్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లలో టాప్ ప్లేస్ లో ఫైమా, రెండవ స్థానంలో రేవంత్ ఉన్నారు. వీరిద్దరి తర్వాత మూడవ స్థానంలో శ్రీ సత్య నాలుగో స్థానంలో చలాకి చంటి ఉన్నారు. ఐదవ స్థానంలో ఇనయా ఉన్నారు. అయితే ఈ ఐదు మంది కంటెస్టెంట్లు సేఫ్ జోన్ లో ఉండగా మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు ఆరోహి అభినయశ్రీ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.
ఇక వీరిద్దరికీ చాలా తక్కువ మొత్తంలో ఓట్లు పడ్డాయని తెలుస్తుంది. ఇలా వీరిద్దరూ డేంజర్ జోన్ లో ఉండగా వీరిలో ఒకరు మాత్రమే బిగ్ బాస్ హౌస్ వీడరున్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు రానున్నారనే విషయంపై సర్వత్ర చర్చలు మొదలవుతున్నాయి. అయితే ఈ వారం తప్పకుండా ఇనయ బయటకు వెళ్తుందని భావించినప్పటికీ ఓటింగ్ శాతం తారుమారు కావడంతో ఈమె సేఫ్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపోతే ఎక్కువగా ఆరోహి బిగ్ బాస్ హౌస్ వీడనున్నట్లు వార్తలు వస్తున్నాయి.