అనసూయ లాస్య ఆగడాలను తులసికి చెబుతుందా…. విషయం తెలుసుకొని బాధపడిన నందు!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందనే విషయాన్నికి వస్తే తులసి తన స్నేహితురాలతో కలిసి ఎంతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే తులసి స్నేహితులు సామ్రాట్ తన భర్త అన్నప్పటికీ తులసి మౌనంగా ఉంటుంది అయితే తన స్నేహితుల ముందు ఏం మాట్లాడలేకపోయానని అనంతరం సామ్రాట్ కు తులసి క్షమాపణలు చెబుతుంది. దీంతో సామ్రాట్ పర్లేదని ఇద్దరు తిరిగి పయణమవుతారు. మరోవైపు శృతి డికాషన్ తీసుకొని అనసూయ పరంధామయ్యకు ఇస్తుంది.

అది చూసిన అనసూయ అదేంటి డికాషన్ తీసుకువచ్చావు కాస్త పాలు కలిపి తీసుకురావచ్చు కదా అని అనడంతో శృతి కావాలని నేను డికాషన్ తీసుకువచ్చాను.ఇలా డికాషన్ తాగటం వల్ల మంచిదని శృతి చెప్పడంతో ఈ డికాషన్ మేము తాగలేమని పరంధామయ్య అంటాడు. దీంతో అనసూయ నేను వెళ్లి పాలు కలిపి తీసుకు వస్తాను అని లేస్తూ ఉండగా వెంటనే శృతి వెళ్ళకండి అమ్మమ్మ అంటూ చెబుతుంది.పాలు లేకపోవడంతోనే డికాషన్ తీసుకువచ్చానని చెప్పగా ఫ్రిజ్లో ఉన్నాయి కదా అని అనసూయ చెబుతుంది.

లాస్య ఫ్రిజ్ కి తాళం వేసుకు వెళ్లిందని వెళ్లి అడిగితే తాళం చెవి ఇవ్వలేదని చెబుతుంది. దీంతో అనసూయ పరంధామయ్య ఇద్దరు బాధపడతారు.అనసూయ కోపం తెచ్చుకొని ఈ విషయం నందుకి చెబుతామని చెప్పగా పరంధామయ్య వద్దు ఈ సమస్యలన్నీ సరిదిద్దడానికి కాస్త సమయం ఇవ్వమన్నాడు కదా అని చెబుతాడు అయితే తులసి వద్దకు వెళ్దామని చెప్పడంతో వద్దు అనసూయ ఆటో చివరికి అదే డికాషన్ తాగుతారు.ఇక ఇంటికి తిరిగి వచ్చిన అనంతరం సామ్రాట్ గారు కారు దిగాలనిపించడం లేదు తాను కారు దిగి వెళితే తన కలలన్నీ తన జ్ఞాపకాలని ఎక్కడ చెల్లా చెదరవుతాయని భయంగా ఉంది అంటూ తులసి మాట్లాడుతుంది.

ఇక సామ్రాట్ మనసులో ఆ ఇంటిని మీకు సొంతం చేయాలని ఉంది అంటూ మనసులో అనుకుంటాడు తులసి మాత్రం నాకు ఇన్ని జ్ఞాపకాలను తిరిగి ఇచ్చిన మీకు చాలా థాంక్స్ ఎప్పటికి రుణపడి ఉంటాను అని చెప్పడంతో ఇందులో నాదేముంది మీరు ముడుపు కట్టారు కదా ఆ ముడుపు ప్రభావమే ఇది అని సామ్రాట్ చెబుతాడు. ఇకపై నాకు ఏ కష్టం వచ్చినా అక్కడికే వెళ్లి ముడుపు కడతా అని చెప్పడంతో సామ్రాట్ సరే అంటాడు. ఇక తులసి కారు దిగుతుండగా ఇంటికి వెళితే మీకోసం ఉంటుందని చెబుతాడు.

ఇంటికి వెళ్లిన ఈమె తన అత్తయ్య కు ఫోన్ చేసి తన పుట్టిన ఊరికి వెళ్లానని అక్కడ మీరంతా కులాసాగా ఉన్నారు కదా అడగడంతో.. అనసూయ ఇక్కడ నేను మీ మామయ్య సంతాప సభ పెట్టుకున్నామని చెబుతుంది. దీంతో తులసి షాక్ అవుతుంది వెంటనే పరంధామయ్య ఫోన్ తీసుకుని ఇక్కడ అంతా బాగున్నాము.ఏదో నేను మీ అత్తయ్య కూర్చుని అలా మాట్లాడుకుంటూ ఉన్నామని చెబుతాడు.ఇక పరంధామయ్య మాట్లాడిన తర్వాత వీలు చూసుకుని తీరిగ్గా ఇంటికి వస్తానని తులసి చెబుతుంది.
ఇక తులసి తన ఊరికి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలాగే నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం తులసి నందు ఇంటికి వెళ్లగా అక్కడికి వెళ్లేసరికి అనసూయ పరందామయ్యా టాబ్లెట్స్ అయిపోయాయని మాట్లాడుకుంటూ ఉంటారు మరి అందుకు చెప్పకూడదా అని అనడంతో వాడికి కూడా ఉద్యోగం లేదు కదా వాడు అయినా ఎక్కడి నుంచి తీసుకువస్తాడు అని మాట్లాడుతారు అది విన్నటువంటి నందు కూడా బాధపడుతూ ఉంటారు.