జబర్దస్త్ వల్ల అన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న అనసూయ మళ్లీ తిరిగి వెళ్ళనుందా?

టీవీ చరిత్రలోనే మొదటిసారిగా ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ప్రారంభమై ఇప్పటివరకు నిర్విఘ్నంగా ప్రసారమవుతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అంతేకాకుండా ఈ షో కి యాంకర్లుగా వ్యవహరించిన రష్మి, అనసూయ కూడా జబర్దస్త్ వల్లే బాగా పాపులర్ అయ్యారు. అయితే కొంతకాలంగా జబర్దస్త్ నుండి బయటకు వెళ్లినవారు ఈ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతకాలం క్రితం కిర్రాక్ ఆర్పి జబర్దస్త్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో సంచలనం రేపాయి.

ఇదిలా ఉండగా ఇటీవల అనసూయ కూడా జబర్దస్త్ కి దూరమైంది. దాదాపు తొమ్మిదేళ్లుగా జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగిన అనసూయ ఇప్పుడు సినిమా అవకాశాలు రావడంతో జబర్దస్త్ కి దూరమైంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. జబర్దస్త్ వల్ల తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తనపై బాడీ షేమింగ్ కూడా చేశారు. రెండేళ్లుగా జబర్ధస్త్ నుండి బయటికి రావాలని చూస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. అయితే గతంలో కొంతకాలం జబర్థస్త్ కి దూరమైన అనసూయ మళ్లీ జబర్థస్త్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. అన్ని బాధలు భరించలేనప్పుడు జబర్ధస్త్ కి ఎందుకు తిరిగి వచ్చావ్ అంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు .

జబర్థస్త్ ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు పొందటమే కాకుండా ఆర్థికంగా కూడా బాగా స్థిరపడింది. అనసూయకు సినిమా అవకాశాలు రావడానికి కారణం కూడా జబర్దస్త్. అనసూయకు జీవితాన్ని ఇచ్చిన జబర్దస్త్ గురించి ఇలా మాట్లాడటంతో నేటిజన్స్ అనసూయ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. భవిష్యత్తులో అవకాశాలు లేక మళ్లీ అనసూయ తిరిగి జబర్దస్త్ కి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. జబర్థస్త్ నుండి బయటికి వెళ్ళిన ఎంతోమంది ఆ షో పట్ల ఉన్న కృతజ్ఞతతో జబర్థస్త్ గురించి తప్పుగా మాట్లాడలేదు. కానీ కిర్రాక్ ఆర్పి సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వత అనసూయా కూడా జబర్థస్త్ వల్ల ఇబ్బందులు పడ్డానని చెప్పటంతో సంచలనంగా మారింది.