కార్తీక్ దీప బతికే ఉన్నారని తెలుసుకున్న సౌందర్య… మరోసారి అనారోగ్యానికి గురైన వంటలక్క!

బుల్లితెర కార్తీకదీపం సీరియల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.సాయంత్రం అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ టీవీల ముందు కట్టిపడేసే కార్తీకదీపం సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరగనుంది అనే విషయానికి వస్తే…కార్తీక్ దీప దగ్గర మాట్లాడుతూ నాకు గతం గుర్తులేదు కానీ నీ తపన నీ బాధలు చూస్తుంటే నేనే నీ భర్తనని తెలుస్తోంది. నన్ను మీ భర్తగానే అనుకో నీ సమస్యలు నా సమస్యలే అంటూ చెప్పగా దీపా ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ కార్తీక్ ను కౌగిలించుకొని ఏడుస్తుంది.

మరోవైపు చంద్రమ్మ ఇంద్రుడు సౌర్యను తీసుకొని వెళుతూ ఉండగా మనం చేసే ప్రయత్నాలు అన్ని చేస్తున్నాం కదా చంద్రమ్మ అంటూ ఇంద్రుడు చెప్పడంతో శౌర్య అమ్మ నాన్నలు ఎక్కడున్నారని బాధపడుతూ ఉంటుంది. ఇలా సౌందర్య ఆనందరావు దీపా కార్తిక్ అందరూ కూడా సౌర్య కోసం వెతుకుతూ ఉంటారు. ఇంద్రమ్మ చంద్రుడు సౌర్య ముగ్గురు సౌందర్య కంటపడటంతో వారిని ఆపి నిలదీస్తుంది. ఇలా అమ్మానాన్నలు బతికున్నారని చెప్పి తన మనవరాలను ఆ ఊరు ఖాళీ చేయించి ఇక్కడికి తీసుకువచ్చారు అంటూ సౌందర్య నిలదీస్తుంది.అప్పుడు సౌర్య లేదు నానమ్మ అమ్మ నాన్నలు ఇక్కడే ఉన్నారంటూ వాదిస్తుంది.

ఇక ఆనందరావు మాట్లాడుతూ నిన్ను చూడటానికి మీ అమ్మ నాన్న వస్తే అది తెలిసి వీళ్ళు నిన్ను ఆ ఊరు కాలు చేయించి ఇక్కడ తీసుకోవచ్చారు అని చెబుతాడు. ఇది నిజామా బాబాయ్ అంటూ శౌర్య అడగగా వెంటనే చంద్రుడు కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి తప్పు చేసాం. జ్వాలమ్మ లేకుండా బతకలేం అందుకే ఇలా చేశామని ఒప్పుకుంటాడు. మరోవైపు సౌందర్య గొంతు గుర్తించిన కార్తీక్ దీప అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా తన కుటుంబ సభ్యులందరినీ చూసి దీపాక ఎమోషనల్ అవుతారు.

ఇక మన కుటుంబాన్ని ఎవరు విడదయలేరని సౌందర్య సంతోషంగా ఉండగా వెంటనే మౌనిత దీపను షూట్ చేస్తుంది. ఇలా షూట్ చేయడంతో ఒక్కసారిగా ఆనందరావు ఉలిక్కిపడి ఇదంతా కలనా నిజంగా తన కొడుకు కోడలు కళ్ళ ముందుకు వస్తే ఎంత బాగుండు అని అనుకుంటాడు.సౌందర్య సౌర్య దగ్గరికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఇంటి ఓనర్ తనని పిలిచి లోపలికి ఆహ్వానిస్తాడు మరోవైపు సౌర్య ఫోటో చూపించి ఇంద్రుడు చేసిన మోసం గురించి దీప చెబుతుంది.ఇక సౌందర్యకు ఇంటి ఓనర్ ఇంద్రుడు ఇల్లు ఖాళీ చేయడానికి కారణం తెలిపాడు సౌర్య వాళ్ళ అమ్మానాన్న రావడంతోనే ఇల్లు ఖాళీ చేశారని చెప్పడంతో సౌందర్య షాక్ అవుతుంది నిజంగానే నా కొడుకు కోడలు బతికారా అంటూ ఆనందపడుతుంది.

మరోవైపు డాక్టర్ బాబు ఆస్తి మొత్తం దానం చేసిన మహిళ తనకు కనిపించి తన కాళ్లపై నన్ను క్షమించండి డాక్టర్ బాబు మీ మంచితనం తెలియక అలా చేశాను అంటూ ఏడుస్తుంది. డాక్టర్ బాబు శౌర్యను వెతకుదాం పదండి అంటుంది మనం వెళ్లాల్సిందే హాస్పిటల్ కి దీప అంటూ తనని హాస్పిటల్ కి తీసుకెళ్తారు.అయితే దీప గతంలో బాధపడుతున్నటువంటి వ్యాధితో బాధపడుతుందని తెలుసుకున్న టువంటి కార్తీక్ ఎంతో ఎమోషనల్ అవుతారు.