రాజమౌళి ఏంటి సుమను అలా గిల్లేసాడు.. క్యాష్ షోలో సందడి చేసిన బ్రహ్మాస్త్ర టీమ్!

బాలీవుడ్ నటీనటులు రణబీర్ కపూర్ అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో తొమ్మిదవ తేదీ విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమాని తెలుగులో రాజమౌళి సమర్పణలో విడుదల చేయడంతో రాజమౌళి సైతం పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.

ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి క్యాష్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మౌని రాయ్, అలియా భట్ రణబీర్ కపూర్, ఎస్ఎస్ రాజమౌళి హాజరయ్యారు.ఇక ఈ కార్యక్రమంలోకి ఎంట్రీ ఇచ్చిన వీరందరికీ సుమ ఎంతో సాదర స్వాగతం పలికారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళిని ఇన్వైట్ చేస్తూ ఆయన ముందు ఫ్లాప్ అనే పదం కూడా ఫ్లాప్ అయిపోయింది ఆయనే ఎస్.ఎస్ రాజమౌళి అంటూ దర్శకుడిని వేదికపైకి ఆహ్వానించారు.

ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా అందరిని ఎంతో సాదరంగా ఆహ్వానించిన సుమ ఒక్కసారిగా దర్శకుడు రాజమౌళి అలాగే బాలీవుడ్ సెలబ్రిటీలు క్యాష్ కార్యక్రమానికి రావడంతో ఇది కళా నిజమా అని ఊహించుకుంది.ఈ క్రమంలోనే రాజమౌళి దగ్గరకు వెళ్లి రాజమౌళి గారు ఒకసారి నన్ను గిల్లండి అని అడిగి మరీ గిల్లించుకుంది. ఇలా సుమ అడగగానే రాజమౌళి కూడా ఆమెను గిల్లడంతో ఇది కల కాదు నిజమే అంటూ సుమ సందడి చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఇది చూసిన ఎంతోమంది నెటిజెన్లు ఇదేందయ్యా ఏకంగా బాలీవుడ్ ఇండస్ట్రీనే సుమా క్యాష్ కార్యక్రమానికి రావడం ఏందీ.. రాజమౌళి దెబ్బ పడితే ఏ వుడ్ అయినా రావాల్సిందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.