సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకున్న సిరి హనుమంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సీరియల్స్ సినిమాలలో నటించిన సిరి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ లో పాల్గొన్న సంగతి తెలిసింది. ఈ సీజన్ లో బిగ్ బాస్ కి వచ్చిన షణ్మఖ్ జస్వంత్ తో కలిసి సిరి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బిగ్ బాస్ హౌస్ లో వీరు ప్రవర్తించిన తీరుతో ప్రేక్షకుల నుండి విమర్శలు ఎదుర్కొన్నారు. వీరి ప్రవర్తన వల్ల షణ్ముఖ్ తన ప్రేయసి దీప్తి సునయనకు దూరం కావలసి వచ్చింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత సిరి షణ్ముఖ్ ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇద్దరూ కూడా వారి వారి పనులలో బిజీ అయ్యి షార్ట్ ఫిలిమ్స్ వెబ్ సిరీస్ అంటూ బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత సిరి, షన్ను ఏ టీవీ షోస్ లో కూడా కనిపించలేదు. కానీ ఇటీవల దసరా సందర్భంగా మల్లెమాలవారు నిర్వహించిన నవరాత్రి ధమాకా కార్యక్రమంలో సిరి హనుమంత్ సందడి చేసింది. ఇటీవల ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యి వైరల్ గా మారింది.
ఇక ఈ స్పెషల్ ఈవెంట్ లో పాల్గొన్న సిరి హనుమంత్ ని హైపర్ ఆది ఒక ఆట ఆడుకున్నాడు. ఈ క్రమంలో ఆది చేస్తున్న ఒక స్కిట్ లో పార్టిసిపేట్ చేసిన సిరి నాన్న రెండు రోజులుగా ఇంట్లో ఉండి నాకు బోర్ కొడుతోంది అని అనగానే.. నీకు రెండు రోజులకే బోర్ కొడుతుంటే మరి అక్కడ 100 రోజులు ఉన్నవ్ మాకెంత బోర్ కొట్టాలి ? అని ఆది అంటాడు. దీంతో నేను బాగానే ఫన్ ఇచ్చానే అని సిరి అనగానే.. ఫన్ను మొత్తం షన్నుకి ఇచ్చావు.. మాకు ఎక్కడ ఇచ్చావు? అని ఆది సిరి మీద సెటైర్ వేస్తాడు. దీంతో సిరి అక్కడి నుండి మొహం తిప్పుకొని పక్కకు వెళ్ళిపోతుంది.