బుల్లితెర పాపులర్ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా బుల్లితెర యాంకర్ గా కొనసాగుతున్న సుమ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితమైన. తన మాటల గారడీతో ప్రేక్షకులను ఆకట్టుకునే సుమ టీవీ షోస్ , సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లతోపాటు సోషల్ మీడియా ద్వారా కూడా బాగా సంపాదిస్తోంది. కొంతకాలం క్రితం సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోస్, షాపింగ్ వీడియోస్, మేకప్ వీడియోలు, వెకేషన్ వీడియోలతో పాటు షూటింగ్ సమయంలో వారు చేసే అల్లరి గురించి వీడియోల ద్వార ప్రేక్షకులతో పంచుకుంటోంది.
ఇలా యూట్యూబ్ ద్వారా బాగా సంపాదిస్తున్న సుమా కృష్ణాష్టమి సందర్భంగా కొత్తగా ఆలోచించింది. సాధారణంగా కృష్ణాష్టమి రోజున ఇంట్లో ఉన్న చిన్న పిల్లలను చిన్ని క్రిష్ణుడు లాగా రాధికలాగా తయారు చేసి సంబరపడుతుంటారు. అయితే ఈ సందర్భంగా సుమ కొత్త ఐడియా ఆలోచించి కృష్ణాష్టమి రోజున కృష్ణుడు లాగా తయారుచేసిన తమ పిల్లల వీడియోలను తనకు పంపితే వాటిని తన యూట్యూబ్ వీడియోలో ప్లే చేస్తామని ప్రకటించింది. దీంతో వందల సంఖ్యలో వీడియోలు వచ్చి పడ్డాయట.ఇలా వచ్చిన వీడియోలను ఒక వీడియోగా చేయటం కష్టమైపోయింది.
పిల్లలందరూ ఎంతో ముద్దుగా ఉన్నారని చెబుతూ.. ఎక్కువ లెంతీగా ఉన్న వీడియోలను చూపించటం కష్టం అవటంవల్ల వాటిని పక్కనపెట్టి కొన్ని వీడియోలను మాత్రమే ఇప్పుడు చూపిస్తానని చెప్పింది. ఈ క్రమంలో అన్ని వీడియోలు చూపించటం కుదరకపోవడంతో వారికి క్షమాపణలు తెలిపింది. ఇలా కొన్ని చిన్ని కృష్ణుల వీడియోలను చూపిస్తూ కౌంటర్లు, కామెంటరీ చేసింది. ఈ వీడియోలో సుమ చెసే కామెంట్లు అందరికి నవ్వు తెప్పించాయి. అయితే ఈ వీడియో చేయటం ద్వార సుమ అధిక సంఖ్యలో వ్యూస్ మరియు లైక్స్ సాధించి బాగా క్యాష్ చేసుకున్నట్లు తెలుస్తోంది.