బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది నిన్నటి ఎపిసోడ్లో భాగంగా వసుధార కోసం రిషి జైలుకు వెళ్లగా రిషి వసుధారతో మాట్లాడాలని ఎస్ఐని బ్రతిమలాడి తనతో మాట్లాడతారు. అప్పుడు కూడా వసుధార తన మెడలో ఎవరు తాళి కట్టారు అనే విషయాన్ని రిషికి చెప్పకపోవడమే కాకుండా ఇంకోసారి తనని కలవద్దని అక్కడి నుంచి వెళ్ళిపొమ్మని వసుధార రిషికే చెబుతుంది.
ఇలా రిషి చాలా ఓపికగా అసలు నిజం ఏంటో చెప్పమని అడిగినా కూడా వసుధార చెప్పకపోవడంతో చేసేదేమీ లేక రిషి తాను మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటూ తిరిగి తన ఇంటికి వెళ్తారు.ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే తాజాగా స్టార్ మా విడుదల చేసిన ప్రోమోలో భాగంగా ఈ సీరియల్ లో నేడు ఏం జరిగింది అనే విషయానికి వస్తే… ఇంట్లో అందరూ కూర్చొని ఉండగా రిషి బాధతో ఇంట్లోకి అడుగు పెడతారు. రిషిని చూసిన మహేంద్ర రిషి ఎలా ఉన్నావు చూడు అంటూ అనడంతో రిషి మాత్రం ఉన్నాను కదా డాడ్ అంటూ బాధగా మాట్లాడతారు.
రిషి మాటలు విన్న జగతి రిషి అనడంతో ఇంకేం మాట్లాడకండి మేడం ఒకప్పుడు మీ శిష్యురాలిని కాలేజీకి తీసుకువచ్చినందుకు మనసులో మీకు నేను థాంక్స్ చెప్పుకున్నాను ఇప్పుడు కూడా మీకు థాంక్స్ చెప్పాలా అంటూ జగతి వైపు చూసి మాట్లాడుతారు. రిషి ఇలా మాట్లాడేసరికి జగతి కన్నీళ్లు పెట్టుకోగా దేవయాని మాత్రం సంతోషపడుతుంది. మీ శిష్యురాలు జీవితంలో మర్చిపోలేని గుణపాఠం నేర్పించింది థాంక్యూ మేడం అంటూ రిషి బరువెక్కిన హృదయంతో జగతికి థాంక్స్ చెబుతారు.మరోవైపు జైల్లో వసుధర రిషి గురించి ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది అయితే నేటి ఎపిసోడ్లో ఇంకా ఏం జరుగుతుందో తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.