బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే వసుదార చక్రపాణి ఇద్దరు మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. మిమ్మల్ని మీరే ఎందుకు తక్కువ చేసుకొని మాట్లాడుకుంటారు నాన్న అని వసుధార నిలదీస్తుంది.ఇప్పుడు నేనేమంత పరువు పోయే పని చేశాను అనడంతో పెళ్లి పీటలు మీద నుంచి లేచిపోవడం పరువు పోయినట్టు కాదా… అలా వెళ్ళిపోతే నేను పరువు పోయి ఎక్కడ ఉరి వేసుకుని చనిపోతానని ఆలోచించడం లేదా అంటూ మాట్లాడుతారు.
అసలు పరువు అంటే ఏంటి నాన్న మనం మనస్సాక్షిగా బతకడం పరువు అంటూ వసుధార కాసేపు నీతులు మాట్లాడుతుంది దాంతో మండిపోయిన చక్రపాణి చూసావా సుమిత్ర నీ కూతురు నాకే నీతులు నేర్పుతుంది అంటూ చక్రపాణి మాట్లాడుతారు అనంతరం తన ఇద్దరు అల్లుళ్ల గురించి ఎంతో గొప్పగా చెప్పడంతో వసుధార వారిని తప్పుగా మాట్లాడుతుంది. నీ ఇద్దరు అల్లుళ్ల గురించి నీకు తెలిస్తే వాళ్లని చెప్పు తీసుకొని కొడతావు నాన్న అనడంతో చక్రపాణి వసుధారపై చేయి చేసుకోవడానికి వెళ్లగా సుమిత్ర అడ్డుపడుతుంది.
ఈ విధంగా వసుధార చక్రపానికి ఎదురు మాట్లాడితే ఉండగా అంతలోనే రిషి అక్కడికి వెళ్లి హారన్ కొడతాడు. రిషి సార్ వచ్చినట్టు ఉన్నాడని వసుధార బయటకు వెళ్ళగా ఎక్కడికి అంటూ చక్రపాణి అడ్డుకుంటాడు. మా సార్ వచ్చాడు అనడంతో ఎవడు మీ సారు అంటూ చక్రపాణి మాట్లాడగా…నాన్న తను మా సార్ అతనితో మర్యాదగా మాట్లాడండి ఇప్పుడు నేను వెళ్లాల్సిందే అంటూ వసుధార తన తండ్రిని ఎదిరించి బయటకు వెళ్తుంది.
బయటకు వెళ్లిన వసుధార రిషిని చూసి ఏంటి సార్ మీరు ఇక్కడికి వచ్చారు అంటూ కంగారుపడుతుంది. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దామంటూ రిషి వసుధార ఇద్దరు కూడా కారులో బయటకు వెళ్తారు. వసుధార మౌనంగా ఉండడం చూసి రిషి ఏమైంది అని అడుగుతాడు.అసలు నాతో పాటు వచ్చిన వసుధారవేనా నువ్వు ఎలా గలగల మాట్లాడే దానివి ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావ్ అసలేం జరిగింది వసుధారా అంటూ ప్రశ్నిస్తాడు.నువ్వు చిన్నప్పుడు తిరిగిన ప్రదేశాలన్నీ చూపించి నీ చిన్ననాటి స్నేహితులకు తనే నాకు కాబోయే భర్తని గర్వంగా చెబుతావు అనుకుంటే ఇలా ఉన్నావేంటి అని అడుగుతాడు.
ఇలా రిషి ప్రశ్నలు వేస్తూ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది అని కూడా అనడంతో నా ఫోన్ కింద పడి పగిలిపోయింది సార్ అని చెబుతుంది. నేను నీకు కొత్త ఫోన్ కొనిస్తాను అసలు ఏం జరిగింది ఇంట్లో అంతా ఓకే కదా..నీ ఫోన్ కోసం ఇంట్లో వాళ్లంతా ఎదురుచూస్తున్నారు. వసుధార అని చెప్పడంతో వాళ్లని ఇప్పుడే రావద్దని చెప్పండి సార్ చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చాను కదా ఇంట్లో అంతా సవ్యంగా ఉన్నప్పుడు చెబుతాను అని మాట్లాడుతుంది.ప్రాబ్లం లేదు కదా అని ఒకటికి రెండుసార్లు రిషి అడిగినప్పటికీ వసుధార మాత్రం ఏమీ లేదని అబద్ధం చెబుతుంది. ఇలా వీరిద్దరూ ఒకరి చేతులు మరొకరు పట్టుకొని మాట్లాడుతూ ఉండగా అదే సమయంలో వసుధార బావ రాజీవ్ అటువైపు వెళుతుండగా కారు ఆపి వీరిద్దరిని చూసి కోపంగా వెళ్ళిపోతాడు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.