బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది ఇకపోతే గత ఎపిసోడ్లో భాగంగా రిషి కాలేజీకి వెళ్లి వసుధార గురించి ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటారు. మరోవైపు వసుధార జైలు నుంచి రిలీజ్ అయ్యి హాస్పిటల్ కి వెళ్లి తన తల్లిదండ్రులను పరామర్శిస్తుంది. ఇక తన తల్లిదండ్రులు ఇద్దరికీ స్పృహ రావడంతో రాజీవ్ యధావిధిగా తన నాటకాన్ని కొనసాగిస్తారు. అయితే రిషి మాత్రం వసుధార ఆలోచనలతో బాధపడుతూ తన క్యాబిన్లో కూర్చుని ఉంటారు.
ఇంతటితో గత ఎపిసోడ్ పూర్తి కాగా నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది ఈ ప్రోమోలో భాగంగా వసుధార తన కాబిన్ వద్దకు రావడం చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అవుతాడు. వసుధారని చూసిన రిషి నువ్వు వచ్చావా అంటూ తనని ప్రశ్నిస్తాడు.దీంతో వసుధార మాట్లాడుతూ ఏం సార్ రాకూడదా? మీరు నన్ను వదిలేసి వస్తే నేను రాను అనుకున్నారా అంటూ మాట్లాడుతుంది.
అప్పుడు రిషి వసుధార మెడలో ఉన్న తాళి చూసి నా ఇష్ట ప్రకారమే నా పెళ్లి జరిగింది అంటూ వసుధార చెప్పిన మాటలను గుర్తుచేసుకొని వెళ్ళిపో వసుధారా నువ్వు వేరే వాళ్ళతో తాళి కట్టించుకున్నప్పుడు నువ్వు నా కళ్ళు ఎదురుగా ఉంటే నేను భరించలేను నీ చేతిలో మోసపోయాను అంటూ ఎమోషనల్ అవుతారు.దీంతో వసుధార నాకు పెళ్లయింది నిజమే కానీ అంటూ మాట్లాడబోతూ ఉండగా రిషి అడ్డుకొని ఇంకేం మాట్లాడకు వసుధార ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ చెప్పడంతో వసుధార షాక్ అవుతుంది.ఇంతటితో ఈ ప్రోమో పూర్తి కాగా ఇది నిజమా లేక రిషికలగంటున్నారా అనే విషయం తెలియాలంటే ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.