హైపర్ ఆది వర్షిణి జంట బుల్లితెరపై ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. వీరిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూసి కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్‌లు ఈ ఇద్దరికి పెళ్లి ఫిక్స్ చేసేశారు. ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకోబోతోన్నారని వార్తలు వచ్చాయి. తాజాగా హైపర్ ఆది వర్షిణిలు అలీతో సరదాగా షోలో పాల్గొన్నారు. ఇందులో వర్షిణి, ఆదిలు చాలా విషయాలను బయటకు చెప్పారు. ఢీ సెట్‌లో జరిగే సంగతులను బయట పెట్టేశారు.
హైపర్ ఆది ఎక్కువగా మాట్లాడడని, ఢీ సెట్‌లో షూటింగ్ జరిగే సమయంలో హైపర్ ఆది సైలెంట్‌గా ఉంటాడని వర్షిణి చెప్పుకొచ్చింది. అయితే తన ఫోన్‌కు ఎక్కువ మెసెజెస్, కాల్స్ రావు గానీ హైపర్ ఆదికి మాత్రం ఎప్పుడూ కాల్స్,మెసెజెస్ వస్తూనే ఉంటాయి.. ఎప్పుడూ ఏదో ఒకటి నొక్కుతూనే ఉంటాడని తెలిపింది. నొక్కేది మాత్రమే చూస్తుందని, ఏం నొక్కుతుందో చూడదని, ఐపీఎల్ స్కోర్ చూస్తుంటానని హైపర్ ఆది కవర్ చేసేశాడు.
డీ సెట్ షూటింగ్ గ్యాప్‌లో రష్మీ సుధీర్ బాగా మాట్లాడుకుంటారు గానీ ఆది మాత్రం తనతో మాట్లాడడని చెప్పుకొచ్చింది. అయితే వర్షిణి కామెడీగా చెప్పినా అందులో మాత్రం ఏదో గుట్టు దాగినట్టే కనిపిస్తోంది. ఓ వైపు షూటింగ్ జరుగుతూ ఉన్నా సెల్ ఫోన్‌లో బిజీగా ఉన్నాడంటే ఏదో ఉన్నట్టే కొడుతోంది. ఏది ఏమైనా వచ్చే ఏడాదిలో పెళ్లి చేసుకోబోతోన్నానని ఓ క్లారిటీ అయితే ఇచ్చేశాడు.