అన్ స్టాపబుల్ సీజన్ 2 టీజర్ రిలీజ్… యాక్షన్ తో పిచ్చెక్కిస్తున్న బాలయ్య?

స్టార్ హీరోగా మంచి గుర్తింపు పొందిన బాలకృష్ణ ఇటీవల ఆహా వేదికగా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బికే ‘ అనే టాక్ షో ద్వారా హోస్ట్ గా మారాడు. ఈ షో లో పాల్గొన్న సెలబ్రిటీలపై బాలకృష్ణ తనదైన శైలిలో కౌంటర్లు, సెటైర్లు, పంచులు వేస్తూ.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఎప్పుడూ సినిమాలో కత్తులు పట్టుకొని మాస్ డైలాగ్స్ చెప్పే బాలకృష్ణ ఈ షో లో వ్యవహరించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇలా అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సూపర్ హిట్ అవడంతో ఇటీవల అన్ స్టాపబుల్ సీజన్ 2 కూడా ప్రారంభించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సీజన్ 2 లో బాలకృష్ణకు సంబంధించిన పోస్టర్లు రిలీజ్ చేయగా.. తాజాగా టీజర్ కూడా విడుదల చేశారు. ఈ టీజర్ డైలాగ్స్ లేకపోయినా బాలయ్య ఎలివేషన్ ప్రేక్షకులకు పిచ్చెకిస్తున్నాయి.

ఈ టీజర్ లో బాలకృష్ణ ఒక వేటగాడిలా చేతిలో గొడ్డలి, కత్తి పట్టుకొని దర్శనమిచ్చాడు . మరోసారి గర్జించడానికి ఎప్పుడు చూడని అవతారంలో బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 తో మీ ముందుకు వస్తున్నారు అంటూ టీజర్ లో రాసుకొచ్చారు. మొత్తానికి షో మొదలు కాకుండానే టీజర్ తోనే ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించారు. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ ని షేక్ చేస్తోంది.ఈ కార్యక్రమం ప్రసారమైతే బాలకృష్ణ ఎలా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తారు అనే విషయంపై పెద్ద ఎత్తున ఆత్రుత నెలకొంది.