అన్ స్టాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్… ఈ సారి వియ్యంకుడితో మొదలుపెట్టనున్న బాలకృష్ణ..?

నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి దశాబ్దాల కాలంగా స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ ఇప్పటికీ వరుస సినిమాలలో నటిస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ చేస్తున్నాడు. ఇలా హీరోగా వెండితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న బాలకృష్ణ అన్ స్థాపబుల్ షో ద్వారా ఇటు బుల్లితెర ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు. ఆహా లో స్ట్రీమ్ అయిన అన్ స్థాపబుల్ టాక్ షో ద్వారా హోస్ట్ గా మారిన బాలకృష్ణ తన మాటలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

ఇలా బాలకృష్ణ హోస్టింగ్ వల్ల షో మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది. దీంతో సీజన్ 2 కూడా ప్రారంభించటానికి మేకర్స్ అన్ని ఏర్పాట్లు సిద్దం చేశారు. ఇక ఇటీవల అన్ స్థాపబుల్ సీజన్ 2 కి సంబంధించి బాలకృష్ణ లుక్ రిలీజ్ చేసారు. సూటు, బూటు, హ్యటు తో ఉన్న బాలకృష్ణ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తాజాగా అన్ స్థాపబుల్ సీజన్ 2 స్ట్రీమింగ్ డేట్ యాజమాన్యం వారు రీవీల్ చేశారు.
అన్ స్టాపబుల్ సీజన్-2 అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఇక ఈ సీజన్ 2 లో పాల్గొనే మొదటి గెస్ట్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ సీక్రెట్ కూడా రివీల్ అయ్యింది. ఈ సీజన్ 2 లో ఫస్ట్ ఎపిసోడ్ లో పాల్గొనబోయే గెస్ట్ మరి ఎవరు కాదు… ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, బాలకృష్ణ వియ్యంకుడు అయిన నారా చంద్రబాబు నాయుడు. మొత్తానికి బాలకృష్ణ ఇచ్చిన మాట నెరవేర్చుకొని తన వియ్యంకుడిని అన్ స్టాపబుల్ షో కి తీసుకువచ్చి ఆయనతో ముచ్చటించనున్నారు.