బిగ్ బాస్ సీజన్ 6 నో చెప్పిన బుల్లితెర యాంకర్?

బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాల్టీ షో కి ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బిగ్ బాస్ 5 సీజన్లు బుల్లితెర మీద ప్రసారం కాగా ఇటీవల ఓటీటి లో నాన్ స్టాప్ సీజన్ కూడా పూర్తయింది. బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతున్న అని ప్రేక్షకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ రియాలిటీ షో ప్రసారమయ్యే డేట్ గురించి కన్ఫామ్ చేయలేదు. అయితే ఈ సీజన్ సిక్స్ లో పాల్గొని కంటెస్టెంట్ల పేర్లు బయట వినిపిస్తున్నాయి. ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సెలబ్రిటీలకు మాత్రమే కాకుండా సామాన్యులకు కూడా అవకాశం కల్పించారు.

ఈ క్రమంలో ఈ సీజన్ సిక్స్ లో పాల్గొనే వారి పేర్లు ఇప్పటికే చాలా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ల ఫైనల్ లిస్ట్ మాత్రం బయటకి రాలేదు. తాజాగా ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొనే కంటెస్టెంట్ల గురించి ఒక వార్త వైరల్ గా మారింది. ప్రతి సీజన్ లో ఎవరో ఒక యాంకర్ మాత్రం తప్పనిసరిగా బిగ్ బాస్ లో పాల్గొంటున్నారు. అయితే ఈ సీజన్ 6 లో కూడా బుల్లితెర యంకర్ ఉదయభాను పాల్గొననున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బుల్లితెర యాంకర్ గా ఉదయ భానుకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు టాప్ యాంకర్ గా గుర్తింపు పొందిన ఉదయభాను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత బుల్లితెరకు కొంచెం గ్యాప్ ఇచ్చింది.

అయితే గత కొంతకాలంగా ఉదయభాను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చి పలు టీవీ షోలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే అవకాశాన్ని అందుకుంది. అయితే ఈ బిగ్ బాస్ లో పాల్గొనేందుకు ఉదయభాను ఆసక్తిగా లేదట. బిగ్ బాస్ యాజమాన్యం భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినా కూడా ఉదయ భాను మాత్రం నో చెప్పిందని సమాచారం. ప్రస్తుతం ఉదయభాను బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఒక టీవీ షోలో యాంకర్ వ్యవహరిస్తోంది. ఈ క్రమంలో ఆ ఛానల్ వారితో అగ్రిమెంట్ చేసుకున్న కారణంగా బిగ్ బాస్ లో పాల్గొనటానికి అవకాశం లేదని ఆవిడ ఈ ఆఫర్ ని తిరస్కరించినట్లు తెలుస్తోంది.