బిగ్ బాస్ 6 లో ఉదయభాను.. కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్ ఆఫర్?

బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి ప్రేక్షకాదరణ వచ్చిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం అన్ని భాషలలో ప్రసారం అవుతూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమం తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని వచ్చే నెల నుంచి ఆరవ సీజన్ ప్రసారానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు అన్నింటిని కూడా పూర్తి చేసినట్లు సమాచారం.ఇకపోతే ఈ కార్యక్రమంలో ఈసారి సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిని అలాగే యాంకర్లు బుల్లితెర ఆర్టిస్టులను తీసుకురానున్నట్లు సమాచారం.

అయితే ఇప్పటివరకు ఈ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి చాలా పేర్లు వినిపించాయి. తాజాగా మరొక యాంకర్ పేరు తెరపైకి వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి యాంకర్ గా నటిగా పని చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ ఉదయభాను బిగ్ బాస్ 6 కార్యక్రమంలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఈమెకు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనాలని నిర్వాహకులు ఆఫర్ ఇచ్చినప్పటికీ పలు కారణాలవల్ల ఉదయభాను ఆ ఆఫర్ రిజెక్ట్ చేసింది.

ఇకపోతే ప్రస్తుతం ప్రసారం కాబోతున్న సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి ఎలాగైనా ఈమెను తీసుకురావాలన్న ఉద్దేశంతో బిగ్ బాస్ నిర్వాహకులు తనకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు సమాచారం.ఇలా ఊహించని విధంగా ఆమెకు రెమ్యూనరేషన్ ఆఫర్ చేసి తనని ఈ కార్యక్రమంలోకి తీసుకురావాలని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఎంతో క్రేజ్ ఉన్నటువంటి ఉదయభాను బిగ్ బాస్ కార్యక్రమంలోకి కనక వస్తే ఇక ఈ కార్యక్రమం మరో రేంజ్ కి వెళ్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.