బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్న ట్రాన్స్ జెండర్… ఆ షో వల్లే ఆఫర్ వచ్చిందా?

తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమం ఒకటి.ఈ కార్యక్రమం ఇప్పటికే తెలుగులో ఐదు సీజన్లను పూర్తి చేసుకొని ఆరవ సీజన్ ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది కంటెస్టెంట్లు మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా, ఇండస్ట్రీలో ప్రస్తుతం వరుస అవకాశాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రతి సీజన్లోనూ ట్రాన్స్ జెండర్ ని తీసుకోవడం మనం చూస్తున్నాము.

ఈ క్రమంలోనే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మరొక ట్రాన్స్ జెండర్ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సీజన్లో ట్రాన్స్ జెండర్ తన్మయి ఆ అవకాశాన్ని అందుకుందని సమాచారం. ఈ క్రమంలోనే ఈమె పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. అయితే తన్మయికి ట్రాన్స్ జెండర్ గా బిగ్ బాస్ అవకాశం ఒక ప్రముఖ టీవీ షో వల్లనే దక్కిందని తెలుస్తోంది. అయితే ఈమె బిగ్ బాస్ అవకాశం ఎలా అందుకున్నారు అనే విషయానికి వస్తే…

తన్మయి జబర్దస్త్ కార్యక్రమంలో లేడీ గెటప్స్ వేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసేది.ఈ విధంగా లేడీ గెటప్స్ వేసుకుంటున్న ఈమె ఏకంగా ట్రాన్స్ జెండర్ గా మారినట్టు ఒక ప్రముఖ షోలో ఈ విషయాన్ని బయటపెట్టారు.ఇలా ఈమె ట్రాన్స్ జెండర్ అనే విషయం బయటపడటంతో ఈసారి బిగ్ బాస్ సీజన్లోకి తనని ట్రాన్స్ జెండర్ గా అవకాశం కల్పించినట్టు తెలుస్తోంది.అయితే ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకుందని వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాలి.