బుల్లితెర మీద సందడి చేస్తున్న యాంకర్లలో వర్షిని కూడా ఒకరు. ఢీ షో లో మెంటర్ గా వ్యవహరించిన వర్షిని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా అందం అమాయకత్వంతో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన వర్షిని పలు టీవీ షోస్ కి యాంకర్ గా కూడా వ్యవహరించి ఆకట్టుకుంది. అయితే ఈ అమ్మడి అదృష్టం కలిసి రాకపోవడంతో యాంకర్ గా బుల్లితెర మీద సరైన అవకాశాలు దక్కించుకోలేకపోయింది.
దీంతో సినిమాలలో నటించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే అక్కడ కూడా వర్షినికి సరైన అవకాశాలు లభించలేదు. దీంతో ఈ అమ్మడు అప్పుడప్పుడు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోస్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వర్షిని చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో తన అందమైన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది.
సోషల్ మీడియాలో కూడా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఇండస్ట్రీలో సరైన అవకాశాలు లభించకపోవడంతో ఇక పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనకి బావ వరుసైన వ్యక్తిని వివాహం చేసుకోవడానికి వర్షిని సిద్ధపడినట్లు సమాచారం. వర్షిని తల్లిదండ్రులు కూడా చిన్నప్పటినుండి వీరికి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే సినిమా అవకాశాల కోసం వర్షిని ఇంతకాలం పెళ్లిని వాయిదా వేసింది..ఇక ఇప్పుడు అవకాశాలు దొరకపోవటంతో పెళ్లి చేసుకోవడానికి అంగీకరించింది. అయితే వర్షిని పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కోట్ల ఆస్తికి వారసుడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి వర్షిని కోటీశ్వరుల ఇంటికి కోడలయ్యే అదృష్టాన్ని పొందింది.