కంటెంట్ ఇవ్వని వాళ్ళు హౌస్ లో కొనసాగుతున్నారు.. నేహా షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఆరవ సీజన్ ప్రసారమవుతూ ఇప్పటికే మూడు వారాలను పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం మూడు వారాలను పూర్తి చేసుకోవడంతో మూడవ వారం హౌస్ నుంచి నేహా చౌదరి ఎలిమినేట్ అయ్యారు. మొదటినుంచి ఇనయా సుల్తానా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతారంటూ వార్తలు వచ్చినప్పటికీ చివరి నిమిషంలో ఎలిమినేషన్లో ట్విస్ట్ ఇస్తూ నేహా చౌదరిని బయటకు పంపించారు.ఇలా మూడవ వారం ఎలిమినేట్ అయినటువంటి ఈమె పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ పెద్ద ఎత్తున బిగ్ బాస్ కార్యక్రమం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా నేహా చౌదరి ఒక ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ నుంచి తాను ఎలిమినేట్ అయ్యాను అంటే చాలామంది ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నారని తెలిపారు. బిగ్ బాస్ నిర్వాహకులు కంటెంట్ ఇవ్వని వాళ్ళను హౌస్ లో పెట్టుకొని, అన్ని టాస్కులలో పాటిస్పేట్ చేసే వారిని ఇలా ఎలిమినేట్ చేస్తున్నారంటూ ఈమె మండిపడ్డారు. ఇక కంటెంట్ ఇవ్వని వాళ్ళ పేర్లు తాను ప్రస్తావించనని అలాగే హోస్ట్ గా నాగార్జున ఫెయిర్ గా ఉండడం లేదని కూడా తెలుస్తోంది. అయితే ఈ విషయం తాను ఏమాత్రం స్పందించదల్చుకోలేదంటూ నేహా వెల్లడించారు.

ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లో ఇనయ సుల్తానా గురించి అందరూ మాట్లాడుతూ తన తప్పు ఉందని చెప్పారు. అయితే నాది తప్పు ఉంటే బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఎక్కడ చూపించలేదు కానీ వీకెండ్ లో మాత్రం నాగార్జున తప్పు మొత్తం నాదేనంటూ సీన్ మొత్తం రివర్స్ చేశారు.అయితే ఆయనకు రాంగోపాల్ వర్మతో మంచి స్నేహం ఉండటం వల్ల రాంగోపాల్ వర్మ చివరి క్షణంలో ఇనయాను సేవ్ చేయాలంటూ చేసిన పోస్ట్ కారణంగానే తను ఎలిమినేట్ కాకుండా తన స్థానంలో నేను ఎలిమినేట్ అయ్యాను అంటూ ఈ సందర్భంగా ఈమె బిగ్ బాస్ కార్యక్రమం గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.