బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా ఎక్కడా తగ్గేదేలే అన్నట్టు అన్ స్టాపుల్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంది. ఈ షో కి, షో హోస్ట్ అయిన బాలయ్యకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఎపిసోడ్ ట్రెండింగ్ ని క్రియేట్ చేస్తుంది.
అన్ స్టాపబుల్ ఫోర్త్ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లో గెస్ట్ గా నారా చంద్రబాబు నాయుడు, సెకండ్ ఎపిసోడ్ గెస్ట్ గా దుల్కర్ సల్మాన్, మూడో ఎపిసోడ్ కి గెస్ట్ గా హీరో సూర్య, నాలుగో ఎపిసోడ్ కి గెస్ట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరయ్యారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ ఎపిసోడ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో కొనసాగుతుంది.
ఇప్పుడు ఫిఫ్త్ ఎపిసోడ్ కి గెస్ట్ గా ఎవరిని తీసుకొస్తారు అని అంచనాలు వేస్తూ ఉండగానే ఎవరిని తీసుకువస్తున్నారో రివిల్ చేస్తూ వాళ్ళ యొక్క గ్లింప్స్ ని కూడా రిలీజ్ చేశారు ఆహా టీం. ఇక ఈ ఎపిసోడ్ లో గెస్ట్లుగా ఎవరు వస్తున్నారంటే టాలీవుడ్ సెన్సేషనల్ నటి శ్రీ లీల, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్ అందించే నటుడు, హీరో నవీన్ పోలిశెట్టి వస్తున్నారు. తాజాగా ఈ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ మేకర్స్ అధికారికంగా విడుదల చేశారు.
నాచురల్ గానే డాన్స్ ఇరగదీసే శ్రీ లీల ఈ షోలో తన డాన్స్ తో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసింది. అంతేకాకుండా వీణ కూడా వాయించి తన మరో టాలెంట్ ని బయటపెట్టింది. ఎంబిబిఎస్ చేస్తూ యాక్టింగ్ చేయడమే గొప్ప అనుకుంటే ఈ అమ్మడికి ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ఇక నవీన్ పోలిశెట్టి చేసే స్టాండింగ్ కామెడీ గురించి అందరికీ తెలిసిందే. ఈ గ్లింప్స్ వచ్చే ఎపిసోడ్ పై అంచనాలని అమాంతం పెంచేసాయి.