బిగ్ బాస్ టైటిల్ తనకే వస్తుంది…. ధీమా వ్యక్తం చేస్తున్న పైమా తల్లి..!

బుల్లితెర మీద సందడి చేస్తున్న అతి తక్కువ మంది లేడీ కమెడియన్లలో ఫైమా కూడా ఒకరు. మొదట పటాస్ షో ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఫైమా అక్కడ పాపులర్ అయి పటాస్ ఫైమా గా మారింది. ఆ పాపులారిటీతో జబర్దస్త్ లో అడుగుపెట్టి అక్కడ కూడా తన టాయిలెట్ నిరూపించుకొని జబర్దస్త్ పైమా గా మారిపోయింది. ఇక జబర్దస్త్ లో కూడా తన కామెడీ టైమింగ్ పంచులతో లేడీ కమెడియన్గా మంచి గుర్తింపు పొందిన ఫైమా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకొని బిగ్ బాస్ ఫైమా గా మారిపోయింది. నిరుపేద కుటుంబం నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన పైమా అంచలంచలుగా ఎదుగుతూ బిగ్ బాస్ వరకు చేరుకుంది. వెండితెర మీద కనిపించాలన్నదే ఆమె కోరిక. బిగ్ బాస్ షో ద్వారా తొందర్లోనే ఫైమ కోరిక కూడా నెరవేరుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా బిగ్ బాస్ ఫైమా తల్లి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొనింది. ఈ ఇంటర్వ్యూలో ఫైమా గురించి తన కుటుంబం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఫైమా ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పుడు మొదటగా మేము కూడా వద్దని వారించాము. కానీ ఫైమా ధైర్యంగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి తన ప్రతిభ నిరూపించుకుంది. నా కూతురి వల్ల మేమందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. చుట్టుపక్కల వారు ఫైమా ని పొగుడుతుంటే చాలా ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఫైమా, నేను మాత్రమే కలిసి ఉన్నామని.. ఫైమా తండ్రి దుబాయ్ ఉన్నాడని ఆమె వెల్లడించింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో తన కూతురు చాలా చక్కగా ఆట ఆడుతుందని, హౌస్ లో ప్రతిరోజు తన కూతుర్ని చూసి మురిసిపోతున్నానని ఈ సందర్భంగా వెల్లడించింది . అంతేకాకుండా ఒకసారి ఫైమాకు దెబ్బ తగిలినప్పుడు ఇక్కడ నేను చలించి పోయాను కానీ అక్కడ ఉన్నవారు నా బిడ్డని చాలా బాగా చూసుకోవడంతో నా మనసు కుదుటపడింది. కచ్చితంగా బిగ్ బాస్ లో నా కూతురు విజేతగా నిలుస్తుంది అంటూ ఫైమా తల్లి తన కూతురి ప్రతిభ పట్ల చాలా నమ్మకంగా ఉంది.