బుద్ధి చెప్పే టైం దగ్గర పడింది.. అనసూయ కామెంట్స్ వైరల్!

బుల్లితెర గ్లామరస్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టీవీ షోలు సినిమాల షూటింగ్ లతో నిత్యం బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో అనసూయ షేర్ చేసే కొన్ని ఫోటోలు వల్ల ఆమె నెటిజన్స్ నుండి విమర్శలు ఎదుర్కొంటుంది. అయితే అనసూయ మాత్రం ఆ విమర్శలు అన్నింటికీ రియాక్ట్ అవుతూ చాలా ఘాటుగా రిప్లై ఇస్తూ ఉంటుంది. తన బాడీ షేమింగ్ గురించి ఏజ్ గురించి ఎవరైనా మాట్లాడినా అనసూయ అసలు ఊరుకోదు.

ఇక కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ అనే పదం వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండ సినిమా ప్లాప్ అవటంతో ఇన్ డైరెక్ట్ గా విజయ్ మీద సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయని అభిమానులతో పాటు మరికొంతమంది నెటిజన్స్ ఆంటీ ఆంటీ అంటూ తెగ ట్రోల్ చేస్తున్నారు. అయితే అనసూయ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అలా తనని ఆంటీ అని పిలుస్తూ ఏజ్ షేవింగ్ చేసిన వారిపై పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ బెదిరింపులకు పాల్పడింది. నేటిజన్స్ మాత్రం అనసూయ బెదిరింపులకు భయపడకుండా ఇప్పటికీ ఆంటీ అంటూ ఆమెను ట్రోల్ చేస్తూ ఉన్నారు. తాజాగా అనసూయ ఓనం పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ క్రమంలో ఒక నెటిజన్ కంప్లైంట్స్ విషయం ఎంత వరకు వచ్చింది..? అని అడిగ్గా మరొక నెటిజన్ రిప్లై ఇస్తూ.. ‘నీలా మాకు పనిపాట లేదనుకుంటున్నావా అని పోలీస్ వాళ్లు చెప్పి పంపించేశారంట..’ అని రిప్లై ఇచ్చాడు.

ఈ కామెంట్స్ పై స్పందించిన అనసూయ.. ‘ లేదండి.. మీలా పనిపాట లేని వాళ్లకు బుద్ధి చెప్పే టైమ్ వచ్చిందని చెప్పారండి. మీకు నోరు జారటంలో తొందర ఎక్కువ. బోల్తా పడటానికి కూడా మీకు తొందరే కదా . కాస్తా ఓపిక పట్టండి. అన్ని జరుగుతాయి… జరుగుతున్నాయి..’ అంటూ రాసుకొచ్చింది. . ఇక మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ ‘ఎవరైనా ఆంటీ లేదా అంకుల్ అని పిలిస్తే ఏ సెక్షన్ కింద కేసు పెట్టవచ్చు..?’ అని ప్రశ్నించాడు. దీనికి స్పందించిన అనసూయ “ఇది ఆంటీని పిలిచినందుకు కాదు.. ఆంటీ పేరుతో రౌడీతనం చేస్తూ నా పని తీరును, నా మానసిక ప్రశాంతతను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర. ఇది శిక్షార్హమైన నేరం..’ అంటూ మరో ట్వీట్ చేసింది ప్రస్తుతం ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.