బిగ్ బాస్ యాజమాన్యం పక్కా ప్లానింగ్… లీక్ చేసే వ్యక్తినే కంటెస్టెంట్ గా మర్చారుగా..?

బుల్లితెర మీద ప్రసారమైన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తిచేసుకుని ఆరవ సీజన్ కి సిద్ధంగా ఉంది. ఇటీవల బిగ్ బాస్ ఓటిటి సీజన్ పూర్తయినప్పటినుండి సీజన్ సిక్స్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు బిగ్ బాస్ అభిమానులు ఆనందపడేలా తొందర్లోనే బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ సీజన్ సిక్స్ లో పాల్గొని కంటెస్టెంట్ ల గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో సామాన్యులకు కూడా అవకాశం కల్పిస్తున్నట్లు నాగార్జున ఇప్పటికే ప్రకటించాడు. దీంతో ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్ ల గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగే ఈ సీజన్ లో కూడా యాంకర్లతో పాటు యూట్యూబర్స్ కూడా అవకాశం కల్పించారని సమచారం. అంతే కాకుండా ఈ సీజన్లో చైల్డ్ ఆర్టిస్ట్ లు కూడా పాల్గొననున్నారని తెలుస్తొంది. ఇప్పటికే ఎంతో మంది యూట్యూబర్స్ పేరు వినిపిస్తున్నాయి . తాజగా మరొక యూట్యూబర్ కి కూడా బిగ్ బాస్ లో అవకాశం దక్కిందని వార్తలు విపిస్తున్నాయి.

ఆ యూట్యూబర్ మరెవరో కాదు బిగ్ బాస్ షో ని ఫాలో అవుతూ.. రివ్యూలు ఇవ్వటమే కాకుండా బిగ్ బాస్ షో గురించి లీక్ చేసే ఆదిరెడ్డి. ఇతని పూర్తి పేరు ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి ప్రతి బిగ్ బాస్ సీజన్ ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు తన రివ్యూలు అందిస్తూ యూట్యూబ్ లో వీడియోలు షేర్ చేస్తూ ఉంటాడు. అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయ్యే కంటెస్టెంట్ ల గురించి కూడా లీక్స్ చేస్తూ ఉంటాడు. ఆదిరెడ్డి ఇలా బాగా ఫేమస్ అయ్యి ఫాలోయర్స్ ని పెంచుకున్నాడు. అందువల్ల బిగ్ బాస్ యాజమాన్యం వారు పక్కా ప్లాన్ వేసి ఆది రెడ్డిని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎంత నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే