బిగ్ బాస్ షో రద్దు చేసే వరకు పోరాటం ఆగదు.. నారాయణ కామెంట్స్ వైరల్?

బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈ కార్యక్రమం తెలుగులో ఆరవ సీజన్ ప్రసారమవుతుండగా ఇతర భాషలలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం కొన్ని సీజన్లను పూర్తి చేసుకొని ఎంతో విజయవంతంగా ప్రసారమవుతుంది.ఇకపోతే తెలుగులో ప్రసారమవుతున్నటువంటి ఈ కార్యక్రమం పై ఇప్పటికే తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది.ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలంటూ ఇదివరకు ఎంతోమంది తీవ్ర వ్యతిరేకత చూపించారు అయితే సిపిఐ నారాయణ ఈ కార్యక్రమం పై మొదటి నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత చూపిస్తున్నారు.

ఇదివరకే ఈయన బిగ్ బాస్ కార్యక్రమాన్ని బ్రోతల్ హౌస్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే హౌస్ లోకి వెళ్లిన కంటెస్టెంట్ల పట్ల టాస్కుల పేరిట ఎక్కువ మొత్తంలో అశ్లీలతను కనబరుస్తున్నారని ఈయన మండిపడ్డారు.దీంతో ఇలాంటి ఒక చెత్త షో ద్వారా సమాజానికి జరిగే మంచి ఏమాత్రం లేదని వెంటనే ఈ షో నిలిపివేయాలంటూ ఈయన మండిపడ్డారు. గతంలో ఎన్నోసార్లు ఈయన ఈ కార్యక్రమాన్ని రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు.

ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ షోపై పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు స్పందించింది ఇందుకు నారాయణ కృతజ్ఞతలు తెలిపారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమా నిర్వాహకులతో పాటు హోస్టు నాగార్జునకి కూడా నోటీసులు జారీ చేశారు.ఇలా కోర్టు పంపించిన నోటీసులకు కౌంటర్ వేయాలని కోరగా బిగ్ బాస్ నిర్వాహకులు తమకు మరో నాలుగు వారాలు పాటు గడువు కావాలని కోరింది.అయితే ఈ కార్యక్రమాన్ని నిలిపి వేసే వరకు తన పోరాటం ఆగదని మరోసారి నారాయణ ఈ కార్యక్రమం పై ధ్వజమెత్తారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ కార్యక్రమం పై నారాయణ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.