బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్గా వసుధార ఎన్నికవ్వడంతో లెక్చరర్స్ అదేంటి మేడం మీరే వసుధర ఓడిపోవాలని చెప్పి గెలిపించారు అనడంతో రిషి ముందు తనని ఓడిపోయేలా చేస్తే రిషి దృష్టి దృష్టిలో నేను ఓడిపోతాను ఇప్పుడు వసుధార గెలిచిన అసలైన గెలుపు నాది అంటూ దేవయాని అసలు ప్లాన్ చెబుతుంది. తాను ఈ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడో ఒకచోట తప్పు చేయకుండా ఉండదు ఆ తప్పు నాకు తెలిసిన మరుక్షణం ఏం చేయాలో నేను చెబుతానని వారికి చెబుతుంది.
ఇంతలో వసుధారకు జగతి ఫోన్ చేసి ఇది గొప్ప విజయం వసు కంగ్రాట్స్ అని చెప్పడంతో ఇది మీరు రిషి సార్ ఇచ్చిన విజయం అని వసుధార చెపుతుంది.అదేం కాదు నీలో ఉన్న ప్రతిభ తెలివితేటలే నిన్ను గెలిపిస్తాయి.నన్ను ఓడించాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పడంతో అలాంటివన్నీ మామూలే దేవయాని అక్కయ్య ఆలోచనలు ఇలాగే ఉంటాయి. రిషి ముందు నిన్ను గెలిపించాలని గెలిపించింది ఇలాంటి వాటి గురించి ఆలోచించకు అని చెబుతుంది.
ఇక ఆ ఇద్దరు లెక్చరర్స్ వసుధార వద్దకు వెళ్లి కంగ్రాట్స్ వసుధార అని చెప్పగా.. గెలుపు ఆపాలని చాలామంది ప్రయత్నించారనీ వసుధార అంటుంది. దీంతో ఆ ఇద్దరు లెక్చరర్స్ రిషి సార్ ను బుట్టలో వేసుకోకపోతే నీ ఆటలు సాగుతాయా ఏంటి అని డైరెక్ట్ గా అంటారు. రిసీ సార్ వీక్నెస్ తెలుసుకుని వసుధారా ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయికి ఎదిగింది.లివింగ్ టుగెదర్ అనే మాటలు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు అంటూ ఆ ఇద్దరు లెక్చరర్స్ వసుధార గురించి తప్పుగా మాట్లాడుతారు.
ఇలా వాళ్ళు మాట్లాడటంతో వసుధార ఎందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆలోచిస్తూ ఆటోలో ఇంటికి వెళ్ళిపోతుంది. జరిగినది మొత్తం జగతికి చెప్పడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు స్టాఫ్ అందరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు వారు ఇలా మాట్లాడటానికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని జగతి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలోపే దేవయాని అక్కడికి వచ్చి వసు, జగతిని అనరాని మాటలు అంటుంది.నువ్వు జగతికన్నా తెలివైన దానివి రిషిని బుట్టలో వేసుకొని ఆడిస్తున్నావు అంటూ ఇష్టం వచ్చినట్లు దేవయాని మాట్లాడటంతో వసుధార రెచ్చిపోయి. మీరు ఈ ఇంట్లో అడిగిన వాటికి వంద రెట్లు దీటుగా సమాధానం చెబుతాను.అంతేకాదు మీరెంటో మీ ఆలోచనలు ఏంటో రిషి సార్ కి అన్ని విషయాలు చెబుతానని చాలెంజ్ చేసి అక్కడి నుంచి ఎవరు పిలిచిన ఆపకుండా వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి తనకోసం గిఫ్ట్ ఒక బొకే తీసుకొని ఇంటికి వస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాల్సి ఉంది.