సోషల్ మీడియాలో రవికృష్ణని ట్యాగ్ చేస్తూ క్రేజీ పోస్టు చేసిన నవ్య స్వామి.. వైరల్ అవుతున్న పోస్ట్?

బుల్లితెర నటుడు రవిక్రిష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వైదేహి పరిణయం సీరియల్ ద్వారా మంచి గుర్తింపు పొందిన రవిక్రిష్ణ ఆ తర్వాత ఆమె కథ అని సీరియల్ లో కూడా నటించాడు. ఈ సీరియల్లో రవి కృష్ణ కి జోడిగా నవ్య స్వామి నటించింది. ఈ సీరియల్ షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అప్పటినుండి వీరిద్దరూ ఎంతో చనువుగా ఉంటున్నారు. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న అనేక టీవీ షోస్ లో కూడా ఇద్దరు కలిసి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. వీరిద్దరూ ఇలా క్లోజ్ గా ఉండటం వల్ల ప్రేమలో పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ వార్తలలో నిజం లేదంటూ వీరిద్దరూ కొట్టి పారేస్తున్నారు.

ఇలా ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ కలిసి తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే కాకుండా ఒకరికొకరు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చుకుంటారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, తొందర్లోనే పెళ్ళి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి మద్య ఉన్న రిలేషన్ గురించి నవ్య స్వామి మాట్లాడుతూ.. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఇంక ఎటువంటి రిలేషన్ లేదని, మేమిద్దరం ఎప్పటికీ మంచి స్నేహితులు లాగే ఉంటామని క్లారిటీ ఇచ్చింది. రవికృష్ణ కూడా నవ్య స్వామి తో ఉన్న రిలేషన్ గురించి ఇదే మాట చెబుతున్నాడు.

ఇదిలా ఉండగా వీరిద్దరూ కూడా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు . ఈ క్రమంలో నవ్య స్వామి చేసే పోస్టులకు రవికృష్ణ లైకులు కామెంట్లు చేస్తూ ఉంటాడు. అలాగే రవికృష్ణ షేర్ చేస్తే పోస్టులకు నవ్య స్వామి కూడా లైక్స్ అండ్ కామెంట్స్ చేస్తూ ఉంటుంది. ఇటీవల నవ్య స్వామి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేస్తూ..కారులో మనతోపాటు మనకు నచ్చిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నప్పుడు..పాటలు పాడుకుంటూ ఉన్నామంటే మనం ఎంతో సంతోషంగా ఉన్నట్టు లెక్క అంటూ పోస్ట్ షేర్ చేస్తూ రవికృష్ణని ట్యాగ్ చేసింది. ఇక నవ్య స్వామీ పోస్టులకి ఎప్పుడు మొదటగా కామెంట్ చేసే రవికృష్ణ కూడా అవును అన్నట్టుగా.. కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.