యాంకర్ గా సక్సెస్ అయిన సుమ…సొంత షోల విషయంలో విఫలమయ్యారా?

గత రెండు దశాబ్దాలుగా బుల్లితెర మహారాణిగా వెలుగొందుతున్న సుమ గురించి తెలియని వారంటూ ఉండరు. ఒకవైపు బుల్లితెర మీద ప్రసారమవుతున్న టీవీ షోలో యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ లో సందడి చేస్తోంది. ఇటు బుల్లితెర ప్రేక్షకులను ప్రేక్షకులను తన మాటలతో ఆకట్టుకున్న సుమ కొత్త యాంకర్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇలా సుమ ఎక్కడ ఉంటే అక్కడ చాలా సందడిగా ఉంటుంది. స్టార్ హీరోల మీద సెటైర్లు వేసినా కూడా వారు నవ్వుతారు తప్ప సుమ మీద కోప్పడిన సందర్భాల్లో లేవు.

ఇలా టీవీ షోలో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లతో బాగా సంపాదిస్తున్న సుమ తన సొంత బ్యానర్లు కూడా కొన్ని షోస్ నిర్వహించింది. అయితే ఈ షో లు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఎక్కువ కాలం ఈ షోస్ ప్రసారం అవ్వలేదు. ఇలా సుమ సొంత బ్యానర్ లో నిర్మించిన టీవీ షోస్ సినిమాల వల్ల భారీగానే నష్టపోయింది. కానీ ఇతర బ్యానర్లో సుమ చేసే ప్రతి ఈవెంట్ సక్సెస్ అవుతుంది. దీంతో సొంత బ్యానర్ సుమకి కలిసి రావటం లేదని గ్రహించి నిర్మాణ రంగానికి దూరంగా ఉంటుంది.

ఇక ప్రస్తుతం సుమ క్యాష్ షో కి మాత్రమే ఫస్ట్ గా వ్యవహరిస్తోంది. ఎక్కువ సమయం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కి కేటాయిస్తుంది. ఇక ఈ మధ్యకాలంలో సొంత యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తన లైఫ్ లో జరిగే ప్రతి ఇన్సిడెంట్ వీడియోలు రూపంలో యూట్యూబ్లో షేర్ చేస్తూ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. బుల్లితెర వెండితెర మీద మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా సుమ తన సత్తా చాటుతోంది.