వెండితెరకు దూరమైన సుమ.. బోసిపోయిన ప్రీ రిలీజ్ వేడుకలు?

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే ఒకప్పుడు ప్రతి ఒక్క ఛానల్ లో ఏదో ఒక కార్యక్రమం ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తే సుమ ఈ మధ్యకాలంలో బుల్లితెర కార్యక్రమాలు తక్కువ అయినప్పటికీ ఈమె సినిమా ఈవెంట్లు ఎక్కువగా చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. దర్శక నిర్మాతలు సుమ డేట్ లను చూసుకొని వారి సినిమా ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నారు అంటే సుమా రేంజ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్, ట్రైలర్ లాంచ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇలా ఏది జరిగిన కచ్చితంగా వేదికపై సుమ సందడి చేయాల్సి ఉంటుంది.ఇలా వరుస సినిమా ఈవెంట్లతో ఎంతో బిజీగా ఉండే సుమ గత కొద్దిరోజులుగా వెండితెరకు దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఈ క్రమంలోనే గత వారం రోజులుగా మూడు పెద్ద సినిమా ఈవెంట్లు జరిగినప్పటికీ సుమా మాత్రం ఈవెంట్లలో ఎక్కడ కనిపించలేదు. ఇలా సుమ లేకపోవడంతో సుమ స్థానంలో ఇతర యాంకర్లు ఈ కార్యక్రమాలలో సందడి చేశారు.

ఇలా ఉన్న ఫలంగా సుమ వెండితెరకు దూరం కావడానికి గల కారణ ఏంటి అనే విషయానికి వస్తే సుమ ప్రస్తుతం హాలిడే వెకేషన్ లో ఉన్నట్టు తన సోషల్ మీడియా ఖాతాలను చూస్తే అర్థమవుతుంది.సుమ చాలా రోజుల తర్వాత తన షూటింగులన్నింటికీ కాస్త విరామం ఇచ్చి ఫ్యామిలీతో కలిసి మాల్దీవులు హాలిడే వెకేషన్ వెళ్ళినట్టు తెలుస్తుంది.ఇలా హాలిడే వెకేషన్ వెళ్లినప్పటికీ ఈమె అక్కడ కూడా తన యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చేస్తూ ఆ వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఏది ఏమైనా సుమక్క లేకపోవడంతో ప్రీ రిలీజ్ వేడుకలు బోసిపోయాయి సుమలేని వెళితే కొట్టొచ్చినట్టు కనపడుతుంది.