అందరిముందు రాకేష్ ని ముద్దులతో ముంచేసిన సుజాత.. షాక్ లో రాకేష్!

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది జంటలుగా బాగా పాపులర్ అయ్యారు. మొదట సుధీర్ రష్మీ జంట బాగా పాపులర్ అయింది. కానీ వాళ్ళిద్దరూ కేవలం ఆన్ స్క్రీన్ మీద మాత్రమే ప్రేమించుకున్నట్లు నటించేవారు. కానీ వారి ప్రేమ టీఆర్పీ రేటింగ్స్ కోసం మాత్రమే అని తేలిపోయింది. సుధీర్ రష్మి తరువాత బాగా పాపులర్ అయిన జంటలలో వర్ష ఇమ్మాన్యూల్ జంట కూడా ఒకటి. మొదట మీరు కూడా నిజంగానే ప్రేమలో ఉన్నారేమో అని అందరూ పొరపాటు పడ్డారు. కానీ వీరిది కూడా సుధీర్ రష్మి లాగానే కేవలం ఆన్ స్క్రీన్ మీద కనిపించే జంట అని అందరికీ అర్థమయిపోయింది.

ఇక జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన జంటల్లో రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత జంట కూడా ఒకటి. వీరిద్దరూ కూడా జబర్దస్త్ లో కలిసి స్కిట్లు చేసేవారు. ఇలా వీరి మధ్య కూడా లవ్ ట్రాక్ మొదలైంది. అయితే అందరిలాగే వీరు కూడా కేవలం స్కిట్ కోసం మాత్రమే అలా నటించే వారని అందరూ అనుకున్నారు. కానీ రీల్ లైఫ్ లో మొదలైన వీరీ ప్రేమ రియల్ లైఫ్ లో కూడా కొనసాగుతోంది. వీరిద్దరూ ఆన్ స్క్రీన్ మీద మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లో కూడా కలసి తిరుగుతున్నారు. ఒకరి ఇంటికి ఒకరు వెళ్తూ కాస్ట్లీ గిఫ్టులు కూడా ఇచ్చుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కలిసి తమ ఫ్రెండ్స్ తో వెకేషన్స్ కి కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సుజాత రాకేష్ ఇంట్లో పూజ కూడా చేసింది.

ఇదిలా ఉండగా తాజాగా రాకేష్ అందరి ముందు సుజాత కి తన ప్రేమని తెలియచేశాడు. ఈటీవిలో “శ్రావణ సందడి” అనే ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి సంబందించిన ప్రోమో ఇటీవల విడుదలైంది. ఈ ప్రోమో లో రాకేష్, సుజాత హైలైట్ గా నిలిచారు. రాకేష్ అందరిముందు సుజాతకి ప్రపోజ్ చేస్తూమాది ప్రమోషన్స్ కోసం పుట్టిన ప్రేమ కాదు జీవితాంతం తోడు ఉండే ప్రేమ అని సుజాతకు ప్రపోజ్ చేశాడు. దీంతో సుజాత ఆనందం వ్యక్తం చేస్తూ రాకేష్ కి గట్టిగా హత్తుకొని నుదిటిపై ముద్దు పెట్టింది. అంతటితో ఆగకుండా ఇంకా గట్టిగా రాకేష్ ని హత్తుకుని అలాగే ఉండిపోయింది. అయితే సుజాత అందరిముందు ఇలా చేయటంతో రాకేశ్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ ఈవెంట్ కి సంబంధించిన ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది.